KTR | తెలంగాణలో 1980 రోజులు.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ విమర్శ
KTR | సోషల్ మీడియాలో 1980‘s ట్రెండ్ నడుస్తుంది.. తెలంగాణలో 1980‘s రోజుల్లో కరెంట్ కోతలతో రైతులు అవస్థలు పడినట్లు ఇప్పుడు అవస్థలు పడుతున్నారు అని రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
KTR | త్రినేత్ర న్యూస్ : సోషల్ మీడియాలో 1980‘s ట్రెండ్ నడుస్తుంది.. తెలంగాణలో 1980‘s రోజుల్లో కరెంట్ కోతలతో రైతులు అవస్థలు పడినట్లు ఇప్పుడు అవస్థలు పడుతున్నారు అని రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని మేము ముందే చెప్పాం.. ఇవాళ అదే జరుగుతుంది. తెలంగాణలో ప్రతి చోట కరెంట్ కోతలు ఉన్నాయని రోజూ పత్రికల్లో వస్తున్నాయి. వీటి మీద సబ్‌స్టేషన్‌ల దగ్గరికి వెళ్లి చెక్ చేస్తే 6 గంటలకు మించి కరెంట్ ఇవ్వడం లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని అన్నాడు. కానీ తెలంగాణ తెచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చి చూపించాం.. మళ్లీ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు రేవంత్ రెడ్డి కరెంట్ లేకుండా చేస్తున్నాడు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో 12 గంటల కరెంట్ కోతలు ఉన్నాయంటే దానికి కారణం ప్రకృతి కాదు, కాంగ్రెస్ యొక్క వైఫల్యం. రేవంత్, భట్టి నాయకత్వంలో విద్యుత్ వ్యవస్థ వెంటిలేటర్‌పై ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 6 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆందోళనలో ఉన్నారు. కరెంటు కోతలపై రేవంత్ సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో రైతులు శ్రీశైలం రహదారిపై ధర్నా చేస్తే.. అసెంబ్లీలో భట్టి విక్రమార్క మాత్రం ఎల్ నినో ప్రభావంతో కరెంటు కోతలు అంటున్నారు. ఇది ఎల్ నినో ప్రభావం కాదు.. ఇది ఎల్ కాంగో ప్రభావం.. కాంగ్రెస్ అనే భూతం తెచ్చిన కరెంట్ కోతలు అని కేటీఆర్ మండిపడ్డారు.
తాజావార్తలు
- ●KTR | జెన్కోకు థర్డ్ గ్రేడ్ కోల్ : కేటీఆర్
- ●Clean Max | క్లీన్ మ్యాక్స్ షేర్లలో జోష్.. భారీ లాభాలకు చాన్స్..
- ●Banks Open on Sunday 27th September | కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఆదివారం సెప్టెంబర్ 27 నాడు బ్యాంకులు ఓపెన్.. ఎందుకంటే?
- ●Congress MLA | ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా
- ●CM Revanth Reddy | కర్ణాటక సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు
- ●Jurala Project | జూరాలకు నీటి విడుదల.. కర్ణాటక ప్రభుత్వం అంగీకారం

KTR | జెన్కోకు థర్డ్ గ్రేడ్ కోల్ : కేటీఆర్

Clean Max | క్లీన్ మ్యాక్స్ షేర్లలో జోష్.. భారీ లాభాలకు చాన్స్..

Banks Open on Sunday 27th September | కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఆదివారం సెప్టెంబర్ 27 నాడు బ్యాంకులు ఓపెన్.. ఎందుకంటే?

Congress MLA | ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా




