Karnataka | కర్ణాటక అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్.. సీఎం సిద్ధరామయ్య ఫైర్
Karnataka | కర్ణాటక అసెంబ్లీలో గురువారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు సభకు వచ్చిన గవర్నర్ థావర్ గహ్లోత్ కేవలం రెండు వ్యాఖ్యల్లోనే ముగించారు.
రెండు వ్యాఖ్యల్లోనే ప్రసంగం ముగింపు
సీఎం సిద్ధరామయ్య తీవ్ర అసహనం
గవర్నర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యుల నినాదాలు
Karnataka | త్రినేత్ర.న్యూస్ : కర్ణాటక అసెంబ్లీలో గురువారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు సభకు వచ్చిన గవర్నర్ థావర్ గహ్లోత్ కేవలం రెండు వ్యాఖ్యల్లోనే ముగించారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ.. సభ్యులందరికీ శుభాకాంక్షలు. మరోసారి కర్ణాటక అసెంబ్లీలో మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉంది. మా ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, భౌతిక అభివృద్ధిని రెట్టింపు చేసేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆ తర్వాత జై హింద్, జై కర్ణాటక అని పేర్కొంటూ గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు.
సీఎం సిద్ధరామయ్య అసహనం
గవర్నర్ ప్రసంగంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభలో గవర్నర్ తన సొంత కవిత్వాన్ని చదివి వినిపించారు.. అంతే తప్ప ప్రభుత్వ నివేదికను ఆయన చదవలేదని సిద్ధరామయ్య అన్నారు. ఇది సభ్యులకు అవమానకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ తీరుపై తమ ప్రభుత్వం, పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తోలుబొమ్మ మాదిరి గవర్నర్ వ్యవహరిస్తున్నారని సీఎం విమర్శించారు.
కర్ణాటకలోనే కొత్త కాదు..
దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గవర్నర్లు వాకౌట్ అస్త్రాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తమిళనాడు గవర్నర్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం కేరళలో కూడా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కూడా ప్రసంగంలోని కొన్ని భాగాలను విస్మరించారని.. తాను సూచించిన మార్పులు ముసాయిదాలో చేర్చలేదంటూ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ఇదే జాబితాలో కర్ణాటక గవర్నర్ థావర్ గహ్లోత్ కూడా చేరారు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలే ఉన్నాయి.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



