Traffic Restrictions | నేడు మిలాద్-ఉన్-నబీ.. హైదరాబాద్‌లో సాయంత్రం 6 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్: మిలాద్-ఉన్-నబీ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ దారూస్సలాంలోని (Darussalam) ఎంఐఎం పార్టీ కార్యాలయంలో జల్సా (Jalsa) కార్యక్రమం నిర్వహించనున్నారు.
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్: మిలాద్-ఉన్-నబీ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ దారూస్సలాంలోని (Darussalam) ఎంఐఎం పార్టీ కార్యాలయంలో జల్సా (Jalsa) కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 6 నుంచి బుధవారం (ఆగస్టు 26) తెల్లవారుజామున 4 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా.. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
మలక్‌కుంట, బేగం బజార్ ఛత్రీ వైపు నుంచి: దారూస్సలాం రోడ్డు వైపు వచ్చే వాహనాలను అలస్కా టి-జంక్షన్ వద్ద ఎంజే బ్రిడ్జ్, ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు.
మల్లేపల్లి ఎక్స్ రోడ్, బోయగూడ కమాన్, మంగళ్‌హాట్ వైపు నుంచి: దారూస్సలాం వైపు వచ్చే వాహనాలను అఘాపురా ఎక్స్ రోడ్ వద్ద టక్కర్‌వాడి మరియు చార్మినార్ వైపు మళ్లిస్తారు.
బజార్ ఘాట్, తాజ్ ఐలాండ్ వైపు నుంచి: దారూస్సలాం వైపు వచ్చే వాహనాలను ఏక్ మినార్ వద్ద బజార్ ఘాట్ మరియు నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
సీతారాంభాగ్, మంగళ్‌హాట్ వైపు నుంచి: దారూస్సలాం రోడ్డు వైపు వచ్చే వాహనాలను అఘాపురా జంక్షన్ వద్ద చార్‌కండిల్ వైపు మళ్లిస్తారు.
మెహదీపట్నం, ఆసిఫ్‌నగర్ వైపు నుంచి: దారూస్సలాం వైపు వచ్చే వాహనాలను మల్లేపల్లి ఎక్స్ రోడ్ వద్ద గోకుల్ నగర్ మరియు బజార్ ఘాట్ వైపు మళ్లిస్తారు.
పార్కింగ్ ఏర్పాట్లు:
దారూస్సలాం జల్సా కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు ట్రాఫిక్ రద్దీ కాకుండా వాహనాలను కేవలం కింద పేర్కొన్న నిర్దేశిత ప్రాంతాలలో మాత్రమే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
గవర్నమెంట్ డిస్పెన్సరీ హాస్పిటల్ (సీతారాంభాగ్): 4-వీలర్లు
అఘా దర్గా: 2-వీలర్లు
సర్దార్ బేగ్ దర్గా: 2-వీలర్లు
పాన్ మండి రోడ్: 2-వీలర్లు
ఎస్‌బీఐ రోడ్: 2-వీలర్లు
రాకెట్ గ్రౌండ్: 4-వీలర్లు
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 25 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పదోన్నతులు ఖాయం!
- ●బీఆర్ఎస్ సంస్థాగత సవాళ్లు: రెండు పొరల పార్టీ నిర్మాణం సరిపోతుందా?
- ●One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?
- ●Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ
- ●Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000
- ●Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

Horoscope | ఆగస్టు 25 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పదోన్నతులు ఖాయం!

బీఆర్ఎస్ సంస్థాగత సవాళ్లు: రెండు పొరల పార్టీ నిర్మాణం సరిపోతుందా?

One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?

Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ






