త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan | తెలంగాణ‌లో జ‌న‌సేన ఉంటుంది.. నేను తిరుగుతా : ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Pawan Kalyan | తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీ ఉంటుంద‌ని.. పార్టీ త‌ర‌ఫున తానే రాష్ట్ర‌మంతా తిరుగుతాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. త‌న ఇంటి వ‌ద్ద మీడియాతో మాట్లాడారు. మొద‌ట తెలంగాణ‌గాణ ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జ‌న‌సేన‌ను తెలంగాణ న‌డిబొడ్డున ఏర్పాటు చేశామ‌న్నారు.

P

Telangana | Published On Jun 2, 2026, 5.26 pm IST

Pawan Kalyan | తెలంగాణ‌లో జ‌న‌సేన ఉంటుంది.. నేను తిరుగుతా : ప‌వ‌న్ క‌ల్యాణ్‌
Advertisement

Pawan Kalyan | తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీ ఉంటుంద‌ని.. పార్టీ త‌ర‌ఫున తానే రాష్ట్ర‌మంతా తిరుగుతాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. త‌న ఇంటి వ‌ద్ద మీడియాతో మాట్లాడారు. మొద‌ట తెలంగాణ‌గాణ ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జ‌న‌సేన‌ను తెలంగాణ న‌డిబొడ్డున ఏర్పాటు చేశామ‌న్నారు. 'తెలంగాణ‌పై జ‌న‌సేన‌కు రాజ‌కీయాల‌కు అతీత‌మైన ప్రేమ ఉంది. జ‌న‌సైనికుల్లో చాలా మంది యువ‌రాజ్యం కార్య‌క‌ర్త‌లు. తెలంగాణ‌పై మాది కొత్త‌గా వ‌చ్చిన ప్రేమ కాదు. ప్ర‌త్యేక రాష్ట్రం కావాల‌న్న వాద‌న కంటే ముందు మేం తెలంగాణ గురించి మాట్లాడాం. తెలంగాణ న‌లుమూల‌లా తిరిగిన వ్య‌క్తిని. ఇప్పుడు న‌న్ను విమ‌ర్శించే వాళ్లు ఆదిలాబాద్ అడ‌వుల్లో ఎప్పుడూ తిరుగ‌లేదు.. నేను తిరిగాను. నేను తెలంగాణ‌కు వ్య‌తిరేకిని కాదు.. విభ‌జించిన తీరుకు వ్య‌తిరేకం. సామాజిక తెలంగాణ రావాల‌ని మ‌రీ వ‌చ్చా. పార్ల‌మెంట్ తలుపులు మూసి విభ‌జించిన తీరు త‌ప్ప‌ని చెప్పా' అని తెలిపారు.

బెదిరించేవాళ్ల అయ్య జాగీరా తెలంగాణ‌

'ఏపీలో గ‌త వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఆంధ్రాలో న‌న్ను తిర‌గ‌నివ్వం అంటే వారాహి అనుమ‌తి ఇచ్చింది తెలంగాణ ప్ర‌జ‌లే. నాకు ఎన్నోసార్లు తెలంగాణ ప్ర‌జ‌లు అండ‌గా నిలిచారు. తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతం చేయాల‌ని మా నాయకులు చాలాసార్లు అడిగారు. ఆంధ్రాలోనే అధికారం కోరుకోని వాడిని. తెలంగాణ‌లో అధికారం ఎందుకు కోరుతా? నాకు అధికారంపై ప్రేమ కాదు.. మార్పుపై ప్రేమ‌. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఆంధ్ర‌పై విద్వేషం లేదు. తెలంగాణ ప్ర‌జ‌లు ద్వేషం పెంచుకుంటే ఒక్క ఏపీ వ్య‌క్తి ఇక్క‌డ ఉండేవారు కాదు. హైద‌రాబాద్‌లో ఎలా అడుగుపెడుతావు ఇక్క‌డ మీకేం ప‌ని అని అడుగుతున్న‌రు. న‌న్ను అడిగేందుకు మీరు ఎవ‌రు? బెదిరించే వాళ్ల అయ్య జారీగా తెలంగాణ‌. బెదిరింపుల‌కు లొంగిపోయేవాడిని కాదు. నేను ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క తెలంగాణ నాయ‌కుడిని కూడా ఒక్క మాట అన‌లేదు. నాకు రెచ్చ‌గొట్ట‌డం ఇష్టం లేదు.. ఎన్నోసార్లు త‌గ్గి ఉన్నా'న‌ని తెలిపారు.

విశ్లేష‌కుడి వ్యాఖ్య‌ల‌తోనే గొడ‌వ‌..

'ఒక విశ్లేష‌కుడి వ్యాఖ్య‌ల వ‌ల్ల గొడ‌వ మొద‌లైంది. ఆ విశ్లేష‌కుడిపై కేసులు పెట్టిన విష‌యం మొద‌ట్లో నాకు తెలియ‌దు. నాకు తెలిశాక కేసులు వ‌ద్దు వ‌దిలేయ‌మ‌ని చెప్పా. ఆ త‌ర్వాత ప్రెస్‌క్ల‌బ్‌లో ప్రెస్‌మీట్ న‌న్ను తిట్టారు. తెలంగాణ‌లో ప్ర‌తి స‌మ‌స్య‌కు ఆంధ్రవారే కార‌ణ‌మా?. ప్ర‌త్యేక తెలంగాణ కోరుకున్న మ‌ర్రి చెన్నారెడ్డి వ‌ల్లే సినీ ఇండ‌స్ట్రీ చెన్నై నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చింది. తెలుగు ప్ర‌జ‌లు 50ఏళ్లు క‌లిసి ఉన్న రాజ‌ధాని హైద‌రాబాద్‌. తెలంగాణ‌కు అన్యాయం చేసిన పాల‌కులను ఉరితీసినా ప‌ర్వాలేదు. పాల‌కులు వేరు.. ప్ర‌జ‌లు వేరు.. పాల‌కుల‌ను తిట్టండి.. ప్ర‌జ‌ల‌ను కాదు. దేశంలో ఎన్నో ప్రాంతాల్లో తెలుగువారు ఉన్నారు. అక్క‌డి ప్ర‌జ‌లు మ‌న తెలుగు ప్ర‌జ‌ల‌ను పంపిస్తే మ‌న పరిస్థితి ఏంటీ?' అని ప్ర‌శ్నించారు.

వైఎస్సార్ హ‌యాంలో కాంగ్రెస్ నేత‌లు ఊడిగం చేశారు

'నేను చెరువును ఆక్ర‌మించుకున్నాన‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డికి చెబుతున్నా నేను క‌బ్జా చేసిన‌ట్లు తేలితే మీరే తీసుకోండి. ఇలాంటి విశ్లేష‌కుల వ‌ల్లే క‌మ్యూనిజం చ‌చ్చిపోయింది. గ‌ద్ద‌ర్ బ‌తికున్న రోజుల్ల మీరంతా ఎక్క‌డ ఉన్నారు?. గ‌ద్ద‌ర్ వ‌చ్చి త‌న‌కు బండి కొనివ్వాలంటే రెండురోజుల్లో కొనిచ్చాను. గ‌ద్ద‌ర్ బ‌తికున్న రోజుల్లో ఆయ‌న‌కు మీరు ఏం చేశారు. వెస్సార్ బ‌తుకున్న‌ప్పుడు మీ గొంతులంతా ఏమ‌య్యాయి?. నాపై మొద‌టి కేసు తెలంగాణ‌లోనే న‌మోదైంది. మీరు మిమ్మ‌ల్ని భ‌య‌పెట్టాల‌ని చూస్తే భ‌య‌ప‌డేవాళ్లం కాదు. నువ్వు తెలంగాణ‌లో ఎలా తిరుగుతావ‌ని కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు బెదిరిస్తున్నారు. వైఎస్ బ‌తికున్న‌ప్పుడు ఇదే కాంగ్రెస్ నేత‌లు ఊడిగం చేశారు. తెలంగాణ‌కు వ్య‌తిరేక‌మ‌ని వైఎస్సార్ బ‌హిరంగంగా చెప్పినా ఆయ‌న‌కే ఊడిగం చేశారు. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టి ఏపీకి వ‌చ్చిన‌ప్పుడు స్వాగ‌తించాను. జ‌న‌సేన మాజీ నాయ‌కుల‌ను బీఆర్ఎస్‌లోకి తీసుకున్నా స్వాగ‌తించాను. కేవ‌లం 2వేలమందితో స‌భ పెట్టుకుంటామంటే అనుమ‌తి ఇవ్వ‌రా? విశ్లేష‌కులు ఇష్టానుసారం మాట్లాడినా మా అభిప్రాయం చెప్ప‌కూడ‌దా? అంటూ ప్ర‌శ్నించారు.

భార‌త్‌తో తెలంగాణ అంత‌ర్భాగం

'తెలంగాణ‌లో జ‌న‌సేన ఉంటుంది.. మేం పోటీ చేసి తీరుతాం. అవ‌స‌ర‌మైతే తెలంగాణలో నేను తిరుగుతా. తెలంగాణ భార‌త‌దేశంలో అంత‌ర్భాగం. ద‌శాబ్దాల బెదిరింపుల‌కు చ‌ర‌మ‌గీతం ప‌లుకుతాం. ప్ర‌తి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. తెలంగాణ‌ను వ్య‌తిరేకించిన వాళ్లు ప‌ద‌వుల్లో కూర్చున్నారు. 12ఏళ్లుగా కిక్కురుమ‌నకుండా కూర్చున్నా. ఇది భార‌త‌దేశం అనుకున్నారా? పాకిస్తాన్‌, పాల‌స్తీనా అనుకుంటున్నారా? ఇది నా దేశం.. నేను ఎక్క‌డైనా అడుగుపెడుతా. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ద‌క్షిణాదిలో ఎక్క‌డైనా పోటీ చేయొచ్చు.. ఇందిరాగాంధీ మెద‌క్‌లో పోటీ చేయొచ్చు. పీవీ న‌ర‌సింహ‌రావు నంద్యాల‌లో పోటీ చేయొచ్చు. ప్రాంతీయ వాద‌మే కాంగ్రెస్ వాద‌మా? కాంగ్రెస్ పార్టీకి ఒక ప‌ద్ధ‌తి అంటూ ఉందా? జాతీయ పార్టీ ప్రాంతీయ వాదం మాట్లాడ‌వ‌చ్చా? ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లాలంటే పాస్‌పోర్టు తీసుకుని వెళ్లాలా? పాశం యాద‌గిరివంటి వారు కూడా న‌న్ను తిడితే బాధేసింది. ఇదే ఇంట్లో పాశం యాద‌గిరితో గ‌తంలో చాలాసార్లు చ‌ర్చించా. మీరు భ‌య‌పెట్టేకొద్దీ మా గుండె మ‌రింత గ‌ట్టిప‌డుతుంది' అంటూ స్ప‌ష్టం చేశారు.

 

Advertisement
Advertisement