త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oppo Instagram | క్రియేట‌ర్ల కోసం ఒప్పో-ఇన్‌స్టాగ్రామ్ స‌రికొత్త ప్రోగ్రామ్‌.. క్వాలిటీ రీల్స్‌ను షేర్ చేయ‌వ‌చ్చు..

Oppo Instagram | దేశంలోని విజువల్ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించేందుకు ఒప్పో ఇండియా, ఇన్‌స్టాగ్రామ్ కలిసి సంయుక్తంగా ఒప్పో లూమో క్రియేటర్ ప్రోగ్రామ్ ను ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా ఉన్న కంటెంట్ క్రియేటర్లకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మైక్రో, నానో స్థాయి ప్రాంతీయ స్టోరీటెల్లర్లకు మరింత గుర్తింపు, నాణ్యమైన సాంకేతిక సహాయం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఆయా సంస్థ‌లు పేర్కొన్నాయి.

S

Technology | Published On Jun 2, 2026, 5.30 pm IST

Oppo Instagram | క్రియేట‌ర్ల కోసం ఒప్పో-ఇన్‌స్టాగ్రామ్ స‌రికొత్త ప్రోగ్రామ్‌.. క్వాలిటీ రీల్స్‌ను షేర్ చేయ‌వ‌చ్చు..
Advertisement

Oppo Instagram | దేశంలోని విజువల్ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించేందుకు ఒప్పో ఇండియా, ఇన్‌స్టాగ్రామ్ కలిసి సంయుక్తంగా ఒప్పో లూమో క్రియేటర్ ప్రోగ్రామ్ ను ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా ఉన్న కంటెంట్ క్రియేటర్లకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మైక్రో, నానో స్థాయి ప్రాంతీయ స్టోరీటెల్లర్లకు మరింత గుర్తింపు, నాణ్యమైన సాంకేతిక సహాయం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఆయా సంస్థ‌లు పేర్కొన్నాయి. ఒప్పోకు చెందిన ప్రత్యేక లూమో ఇమేజ్ ఇంజిన్ టెక్నాలజీని, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌తో అనుసంధానించడం ద్వారా క్రియేటర్లకు మెరుగైన వీడియో నాణ్యతను అందించనున్నారు. దీని ద్వారా భారత క్రియేటర్ ఎకానమీలో ప్రొఫెషనల్ ప్రమాణాలను మరింత పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి.

నియ‌ర్‌-లాస్‌లెస్ క్వాలిటీలో అప్‌లోడ్‌..

ఈ భాగస్వామ్యంలో కీలకమైన అంశం వీడియో షేరింగ్ కోసం రూపొందించిన ప్రత్యేక టెక్నికల్ ఆప్టిమైజేషన్. ఫ్లాగ్‌షిప్ ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్ వినియోగదారులు ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలను నియర్-లాస్‌లెస్ క్వాలిటీలో అప్‌లోడ్ చేయవ‌చ్చు. సాధారణంగా వీడియోలను అప్‌లోడ్ చేసే సమయంలో జరిగే కంప్రెషన్‌ను ఈ ఇంటిగ్రేషన్ గణనీయంగా తగ్గిస్తుంది. ఫలితంగా వీడియోల అసలు క్లారిటీ, కలర్ అక్యూరసీ, డైనమిక్ రేంజ్ మెరుగ్గా నిల్వ ఉంటాయి. దేశంలో ఒక స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థతో ఇన్‌స్టాగ్రామ్ ఈ స్థాయిలో సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ కోసం కలిసి పనిచేయడం ఇదే తొలిసారి అని సంస్థలు పేర్కొన్నాయి.

నిరంతరంగా కొన‌సాగింపు..

ఒప్పో లూమో క్రియేటర్ ప్రోగ్రామ్ నిరంతర కార్యక్రమంగా కొనసాగనుంది. ప్రతి నెల ప్రత్యేక థీమ్‌లతో ఛాలెంజ్‌ల‌ను నిర్వహించనున్నారు. యువత సంస్కృతి, రోజువారీ జీవితం, భారతీయ ప్రాంతీయ కథనాలపై కంటెంట్ రూపొందించేందుకు క్రియేటర్లను ప్రోత్సహిస్తారు. పాల్గొనే వారికి ప్రత్యేక మాస్టర్‌క్లాస్‌లు, మెంటర్‌షిప్ సెషన్‌లలో పాల్గొనే అవకాశం ఉంటుంది. విజేతలకు అధికారిక మెటా అండ్‌ ఒప్పో సర్టిఫికేషన్ ను అందజేయనున్నారు. అత్యుత్తమ ఎంట్రీలను అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ షోకేస్‌లో ప్రదర్శించి భారతీయ క్రియేటర్లకు ప్రపంచవ్యాప్త గుర్తింపును కల్పించనున్నారు.

ఎలా పాల్గొనాలి..

ఈ కార్యక్రమం మే 29న అధికారికంగా ప్రారంభమైంది. పాల్గొనేవారు ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్దేశించిన నెలవారీ హ్యాష్‌ట్యాగ్‌లతో తమ ఎంట్రీలను సమర్పించాలి. క్రియేటివిటీ, ఒరిజినాలిటీ, సాంస్కృతిక ప్రాముఖ్యత, మొత్తం ఎంగేజ్‌మెంట్ రేట్ వంటి అంశాల ఆధారంగా పరిశ్రమ నిపుణుల బృందం ఎంట్రీలను మూల్యాంకనం చేస్తుంది. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కేటగిరీల్లో విజేతలను ఎంపిక చేస్తారు. వారికి నగదు ప్రోత్సాహకాలు, తాజా ఒప్పో స్మార్ట్‌ఫోన్లు, ఒప్పో ఐఓటీ ఎకోసిస్టమ్ ఉత్పత్తుల‌ను బహుమతులుగా అందించనున్నారు. క్రియేటర్ ఎకానమీకి సంబంధించిన తాజా ట్రెండ్స్, సవాళ్లు, వృద్ధి అవకాశాలపై చర్చించేందుకు ఒప్పో ప్రత్యేక నిపుణుల వాడ్‌కాస్ట్‌ను కూడా ప్రారంభిస్తోంది. ఈ జ్యూరీ, వాడ్‌కాస్ట్ ప్యానెల్‌లో అంకిత్ రిహాల్‌, సైమ‌న్ లూ, విక్రం చ‌న్నా, జోసెఫ్ రాధిక్‌, తాన్యా ఖ‌నిజోవ్, కెన్నీ సెబాస్టియ‌న్ వంటి ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ వాడ్‌కాస్ట్ తొలి ఎపిసోడ్ జూన్ 6న ఒప్పో ఇండియా అధికారిక యూట్యూబ్ చాన‌ల్ లో ప్రసారం కానుంది.

Advertisement
Advertisement