KTR | T-Works ఒక భవనం కాదు.. యువత కలల ప్రయోగశాల: కేటీఆర్
KTR | T-Works అనేది ఒక భవనం కాదని.. అది తెలంగాణ యువత కలలకు రెక్కలు తొడిగిన ప్రయోగశాల అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవిష్యత్తును ప్రపంచానికి పరిచయం చేసిన విజన్ అని.. కేసీఆర్ ఆలోచనల్లో పుట్టి, యువత చేతుల్లో సాంకేతిక శక్తిగా మారిన గొప్ప వేదిక అని కొనియాడారు.
త్రినేత్ర.న్యూస్: T-Works అనేది ఒక భవనం కాదని.. అది తెలంగాణ యువత కలలకు రెక్కలు తొడిగిన ప్రయోగశాల అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేక్ ఇన్ తెలంగాణ అనే ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్తును ప్రపంచానికి పరిచయం చేసిన విజన్ అని తెలిపారు. కేసీఆర్ ఆలోచనల్లో పుట్టి, యువత చేతుల్లో సాంకేతిక శక్తిగా మారిన గొప్ప వేదిక అని కొనియాడారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
స్టార్టప్‌లకు కేవలం మాటల ప్రోత్సాహం కాదు.. ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అత్యాధునిక టెక్నాలజీ, ఇన్నోవేషన్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం బీఆర్‌ఎస్ ప్రభుత్వం. ఈనాడు దేశం మొత్తం డ్రోన్లు, డిఫెన్స్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణలో ఆ బీజం ఎన్నో ఏళ్ల క్రితమే నాటింది కేసీఆర్.
దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్‌ను తీసుకొచ్చి హైదరాబాద్‌ను ఇన్నోవేషన్ హబ్‌గా నిలబెట్టిన దూరదృష్టి కేసీఆర్ దే. ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న ఈ సంస్థ తెలంగాణ అభివృద్ధి ఎంత ముందుచూపుతో సాగిందో మరోసారి నిరూపిస్తోంది అని కేటీఆర్ ప్రశంసించారు.
‘యాంటీ డ్రోన్ బుల్లెట్’ పేరిట ఒక ప్రత్యేక సాంకేతిక ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రోటో టైపింగ్, ఇన్నోవేషన్ కేంద్రం.. టీ-వర్క్స్ చేపట్టింది. ఇప్పటికే యుద్ధాల్లో డ్రోన్లను వినియోగిస్తుండడంతో భవిష్యత్‌లో వీటి ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీ-వర్క్స్ తన టెక్నాలజీని భారత సైన్యానికి అందించింది. దీనిపై కేటీఆర్ తాజాగా స్పందించారు.
తాజావార్తలు
- ●Zaheerabad Farmers | జహీరాబాద్ రైతుల వినూత్న ప్రయత్నం.. 130 రకాల పంటలు సాగు..!
- ●Preity Mukhundhan | విజయ్ దేవరకొండతో స్టెప్పులేయనున్న మలయాళ బ్యూటీ - రౌడీ జనార్దనలో స్పెషల్ సాంగ్!
- ●AIADMK MLA | అన్నాడీఎంకేలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం.. నాలుగో ఎమ్మెల్యే కూడా..
- ●SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

Zaheerabad Farmers | జహీరాబాద్ రైతుల వినూత్న ప్రయత్నం.. 130 రకాల పంటలు సాగు..!

Preity Mukhundhan | విజయ్ దేవరకొండతో స్టెప్పులేయనున్న మలయాళ బ్యూటీ - రౌడీ జనార్దనలో స్పెషల్ సాంగ్!

AIADMK MLA | అన్నాడీఎంకేలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం.. నాలుగో ఎమ్మెల్యే కూడా..

SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ




