త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. నాణెనికి బొమ్మ‌, బొరుసు లాంటి వారు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. నాణెనికి బొమ్మ‌, బొరుసు లాంటి వారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గ‌తంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ, ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న బీజేపీ కానీ పేద‌వాళ్ల‌కు స‌న్న‌బియ్యం ఇవ్వాల‌న్న ఆలోచ‌న చేయ‌లేదు అని సీఎం తెలిపారు.

S

Telangana | Published On Aug 15, 2026, 4.40 pm IST

CM Revanth Reddy | బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. నాణెనికి బొమ్మ‌, బొరుసు లాంటి వారు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. నాణెనికి బొమ్మ‌, బొరుసు లాంటి వారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గ‌తంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ, ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న బీజేపీ కానీ పేద‌వాళ్ల‌కు స‌న్న‌బియ్యం ఇవ్వాల‌న్న ఆలోచ‌న చేయ‌లేదు అని సీఎం తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్మార్ట్ రేష‌న్ కార్డుల పంపిణీ సంద‌ర్భంగా సీఎం రేవంత్ ప్ర‌సంగించారు.

ఈ రేష‌న్ కార్డు కేవ‌లం కాగితం కాదు.. ఒక ప్లాస్టిక్ వ‌స్తువు కాదు.. ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధ‌నం కాదు.. ఇది మీ ఆత్మ‌గౌవ‌రం.. ఎక్క‌డికి వెళ్లినా మీ ఆక‌లిని తీర్చే ఆత్మ‌గౌర‌వం. ఎవ‌రి ముందు చేయి చాచి నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం లేదు. పేద‌వాడు కూడా ఆక‌లితో ప‌స్తులు ఉండ‌కూడ‌ద‌నే సంక‌ల్పంతో నాటి నుంచి నేటి వ‌ర‌కు నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌ను పంచ‌డానికి రేష‌న్ సాపుల‌ను క‌నిపెట్టేందే కాంగ్రెస్ అని సీఎం గుర్తు చేశారు.

ఆత్మ‌గౌర‌వం కోసం అహ‌ర్నిశ‌లు ప‌రిత‌పించారు ఇందిరా గాంధీ

మెద‌క్ పార్ల‌మెంట్ స్థానం నుంచి ఇందిరాగాంధీ పోటీ చేస్తే మీరు గెలిపించారు. ఆ త‌ర్వాత ఆమె ప్ర‌ధానిగా దేశానికి వ‌న్నె తెచ్చారు. అంతే కాకుండా పారిశ్రామిక వాడ‌గా త‌యారు చేశారు. ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించారు. పేద‌ల సంక్షేమం, ఆత్మ‌గౌర‌వం కోసం అహ‌ర్నిశ‌లు ప‌రిత‌పించారు ఇందిరా గాంధీ. ఆమెను ఆద‌ర్శంగా తీసుకుని ప్ర‌జా పాల‌నలో పేద‌ల‌కు సంక్షేమం అందిస్తున్నామ‌ని సీఎం తెలిపారు.

దొడ్డు బియ్యం వండి బుక్కెడు బువ్వ పెట్టారా..?

ఉచిత క‌రెంట్ గురించి ఒకాయ‌న, స‌న్న‌బియ్యం గురించి ఇంకొకాయ‌న‌, ఇందిర‌మ్మ ఇండ్ల గురించి ఇంకొక‌రు, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ గురించి ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నామ‌ని, ప్ర‌శ్నిస్తున్నామ‌ని అంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. నాణెనికి బొమ్మ బొరుసు లాంటి వారు బీజేపీ, బీఆర్ఎస్. ప‌దేండ్లు మీరు, 12 ఏండ్లు మోదీ ఉన్నారు.. ఎన్న‌డైనా పేద‌వాడికి స‌న్న‌బియ్యం ఇవ్వాల‌ని క‌ల‌ల‌లో నైనా మీరు ఆలోచ‌న చేశారు. గ‌తంలో దొడ్డు బియ్యం ఇస్తే వాటిని ప‌శువులు, కోళ్ల దాణా కోసం, ఇథ‌నాల్ త‌యారీ కోసం, బీర్ల కంపెనీల‌కు అమ్ముకునే ప‌రిస్థితి. ఆ ప‌దేండ్లు దొడ్డు బియ్యం వండి బుక్కెడు బువ్వ పెట్టారా..? ఆలోచించండి. ఈ ప్ర‌భుత్వం 3 కోట్ల 48 ల‌క్ష‌ల మందికి ప్ర‌తి నెల 2 ల‌క్ష‌ల‌ 16 వేల క్వింటాళ్ల స‌న్న‌బియ్యాన్ని 17 వేల పైచిలుకు రేష‌న్ షాపుల్లో పంపిణీ చేస్తున్నాం. ఉత్త‌మ్ ఇచ్చే స‌న్న బియ్యం కోళ్ల‌కు, బ‌ర్రెల‌కు దాణాగా వాడారా..? ఇవాళ మేం ఇచ్చే స‌న్న‌బియ్యంతో చంటి బిడ్డ‌ల‌కు వండి పెడుతున్న‌రు. ప్ర‌జ‌లు బుకెడు బువ్వ క‌డుపు నిండా తిని.. కంటి నిండా నిద్ర పోతున్న‌రు. అంతేకాదు మేం స‌న్నబియ్యం ఇవ్వ‌డంతో.. మార్కెట్‌లో ఉన్న స‌న్న‌బియ్యం ధ‌ర రూ. 45కు త‌గ్గింద‌ని సీఎం తెలిపారు.

Advertisement
Advertisement