త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maheshkumar Goud | యువ‌త చ‌రిత్రను తెలుసుకోవాలి.. దేశం కోసం ఏక‌మ‌వ్వాలి

Maheshkumar Goud | యువ‌త చ‌రిత్ర‌ను తెలుసుకొని దేశం కోసం ఐక్యంగా నిల‌బ‌డాల‌ని టీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షుడు బొమ్మ మ‌హేశ్‌కుమార్ డౌడ్ పిలుపునిచ్చారు.

S

Telangana | Published On Aug 15, 2026, 4.14 pm IST

Maheshkumar Goud | యువ‌త చ‌రిత్రను తెలుసుకోవాలి.. దేశం కోసం ఏక‌మ‌వ్వాలి
Advertisement
  • స్వాతంత్య్ర వేడుక‌ల్లో టీపీసీసీ చీఫ్‌ మ‌హేశ్‌కుమార్ గౌడ్

Maheshkumar Goud | త్రినేత్ర‌.న్యూస్: యువ‌త చ‌రిత్ర‌ను తెలుసుకొని దేశం కోసం ఐక్యంగా నిల‌బ‌డాల‌ని టీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షుడు బొమ్మ మ‌హేశ్‌కుమార్ డౌడ్ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర‌ వేడుకలను పుర‌స్క‌రించుకొని శ‌నివారం హైద‌రాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయ‌న జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ, భారతదేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

విభజన రాజకీయాలను తిరస్కరించాలి. మరింత బలమైన, ప్రజాస్వామ్య, సమ్మిళిత భారతదేశం కోసం యువ‌త‌ ఐక్యంగా నిలవాలి. భార‌త్‌ను మరింత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి మనమందరం సంఘీభావం ప్రకటిద్దాం అని మ‌హేశ్‌కుమార్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement