ITBP | కాన్పూర్ పోలీస్ కమిషనరేట్‌ను చుట్టుముట్టిన ఐటీబీపీ కమాండోలు
ITBP | ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ (Kanpur) పోలీస్ కమిషనరేట్‌ను ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP) కమాండోలు చుట్టుముట్టడం కలకలం సృష్టించింది. ఓ కమాండర్ తనకు న్యాయం కావాలంటూ వైద్యులు కట్ చేసిన తన తల్లి చేయిని కమిషనర్ ముందుంచారు.
ITBP | త్రినేత్ర.న్యూస్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ (Kanpur) పోలీస్ కమిషనరేట్‌ను ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP) కమాండోలు చుట్టుముట్టడం కలకలం సృష్టించింది. ఓ కమాండర్ తనకు న్యాయం కావాలంటూ వైద్యులు కట్ చేసిన తన తల్లి చేయిని కమిషనర్ ముందుంచారు. అతనితోపాటు ఐటీబీపీ అధికారులు కూడా సీపీ ఆఫీస్‌కు (Police Commissionerate) రావడం గమనార్హం.
అసలేం జరిగిందంటే..
వికాస్ సింగ్ అనే జవాన్ ఐటీబీపీ మహరాజ్‌పూర్ యూనిట్‌లో పనిచేస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో (Breathing Difficulties) ఇబ్బందిపడుతున్న తన తల్లిని కాన్పూర్‌లోని కృష్ణా హాస్పిటల్‌లో చేర్చారు. చికిత్సలో భాగంగా ఆమె చెయ్యి ఇన్‌ఫెక్షన్ అయింది. చూస్తుండగానే ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను పరాస్ హాస్పిటల్‌కు తరలించారు. పరిశీలించిన అక్కడి వైద్యులు వికాస్ తల్లి చెయ్యి తొలగించాలని, అలాగైతేనే ఆమెను రక్షించగలమని చెప్పారు. కృష్ణా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నప్పుడే ఆమె చెయ్యికి ఇన్‌ఫెక్షన్ అయిందని చెప్పారు.
తనకు న్యాయం కావాలని తల్లి చెయ్యిని పట్టుకొని అధికారులు, ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నానని వికాస్ సింగ్ వాపోయారు. అయినప్పటికీ న్యాయం లభించకపోగా, కృష్ణా హాస్పిటల్ యాజమాన్యానికి వైద్య శాఖ క్లీన్ చిట్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా హాస్పిటల్‌లో చికిత్స కోసం జాయిన్ అయిన తెల్లారే ఆమె చెయ్యి ఇన్‌ఫెక్షన్‌కు గురైందని చెప్పారు. వారి నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని, హాస్పిటల్ ఐసీయూ సిబ్బంది, వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, తనకు న్యాయం లభించకపోవడంతో తోటి సిబ్బందితో కలిసి ఆమె చెయ్యిని తీసుకుని పోలీస్ కమిషనరేట్‌కు వెళ్లారు. హాస్పిటల్ సిబ్బంది కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై ఏఎస్పీ అమర్‌నాథ్ మాట్లాడుతూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇప్పటికే త్రిసభ్య కమిటీ వేశారని, అందులో సిబ్బంది నిర్లక్ష్యం వెళ్లే ఆమె చెయ్యిని తీసేయాల్సి వచ్చిందని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
#कानपुर:ITBP के जवान की मां का हाथ काटने का मामला,टाटमिल स्थित कृष्णा हॉस्पिटल की लापरवाही,हॉस्पिटल को स्वास्थ्य विभाग ने दी क्लीन चिट,नाराज आईटीबीपी के सैकड़ों जवान पहुंचे कमिश्नरेट,ITBP के अधिकारी मौजूद,पुलिस कमिश्नर से बातचीत.@ITBP_official @kanpurnagarpol #Kanpur pic.twitter.com/TKcWo29TxW
— Axis Metro News (@Axismetromedia) May 23, 2026
సంబంధిత వార్తలు

Special Trains | ఆగస్టులో కాచిగూడ-తిరుచానూరు మధ్య.. వరంగల్ మీదుగా కాన్పూర్-మధురై ప్రత్యేక రైళ్లు
జులై 30, 2026

BTech gold medallist | 50 సార్లు ఉద్యోగ ప్రయత్నం విఫలం.. సూసైడ్ చేసుకున్న గోల్డ్‌మెడలిస్ట్
జులై 20, 2026

Electric Shocks | తాగొచ్చి గొడవ చేస్తున్నాడని.. భర్తను మంచానికి కట్టేసి కొట్టి.. కరెంటు షాక్ పెట్టి చిత్రహింసలు..
జులై 8, 2026
తాజావార్తలు
- ●Stock Markets | క్లోజింగ్ వేలం ఎఫెక్ట్.. నిఫ్టీకి భారీ షాక్, ఐటీ షేర్లపై ఒత్తిడి..
- ●Wedding Sherwani | ఇస్త్రీ చేస్తుండగా కాలిన షేర్వాణీ.. రూ. 14 వేలు జరిమానా విధించిన కోర్టు
- ●Tiger | నడిరోడ్డుపై పెద్ద పులి.. బైకర్ ఏం చేశాడో తెలుసా..?
- ●Vastu Tips | గులాబీ మొక్క శుభమా..? అశుభమా..? ఏ దిశలో నాటితే మంచిది..?
- ●HMWSSB | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా బంద్
- ●Horoscope | ఆగస్టు 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించిన ఆర్థిక లాభాలు..!

Stock Markets | క్లోజింగ్ వేలం ఎఫెక్ట్.. నిఫ్టీకి భారీ షాక్, ఐటీ షేర్లపై ఒత్తిడి..

Wedding Sherwani | ఇస్త్రీ చేస్తుండగా కాలిన షేర్వాణీ.. రూ. 14 వేలు జరిమానా విధించిన కోర్టు

Tiger | నడిరోడ్డుపై పెద్ద పులి.. బైకర్ ఏం చేశాడో తెలుసా..?

Vastu Tips | గులాబీ మొక్క శుభమా..? అశుభమా..? ఏ దిశలో నాటితే మంచిది..?



