ISRO | ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. అన్వేష మిషన్ కౌంట్‌డౌన్ షురూ..!
ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 2026 సంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా తొలి ప్రయోగం చేపట్టబోతున్నది. ఈఓఎస్ఎన్1 శాటిలైట్‌ను పీఎస్ఎల్‌వీ సీ62 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లనున్నది. ఈ మిషన్ కోసం ఇస్రో ఆదివారం కౌంట్‌డౌన్ ప్రారంభించింది. 22 గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగనున్నది.
ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 2026 సంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా తొలి ప్రయోగం చేపట్టబోతున్నది. ఈఓఎస్ఎన్1 శాటిలైట్‌ను పీఎస్ఎల్‌వీ సీ62 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లనున్నది. ఈ మిషన్ కోసం ఇస్రో ఆదివారం కౌంట్‌డౌన్ ప్రారంభించింది. 22 గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగనున్నది. రాకెట్ ఉదయం 10.18 గంటలకు శ్రీహరికోటలోని షార్‌లోని తొలి ప్రయోగ వేదిక నుంచి రాకెట్ దూసుకెళ్లనున్నది. గతేడాది మేలో చేపట్టిన పీఎస్ఎల్‌వీ ప్రయోగం విఫలమైన విషయం తెలిసిందే. రాకెట్ మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఈవోఎస్09 రాడార్ ఇమేజింగ్ శాటిలైట్‌ను నష్టపోవాల్సి వచ్చింది. 32 సంవత్సరాల కాలంలో పీఎస్ఎల్‌వీ 63 ప్రయోగాల్లో ఇది మూడో వైఫల్యం.
ఈ మిషన్‌లో ఈఓఎస్ఎన్1 (అన్వేష) శాటిలైట్‌ను ఇస్రో నింగిలోకి పంపనున్నది. ఈ శాటిలైట్‌ను డీఆర్డీవో తయారు చేసింది. ఈ శాటిలైట్ దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నది. శత్రువుల కదలికలపై అన్వేష శాటిలైట్ నిఘా వేయనున్నది. ఈ భూ పరిశీలన ఉపగ్రహం సుమారు 1,485 కేజీలు బరువు ఉంటుంది. దీన్ని భూమికి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నది. ఇప్పటి ఇస్రో చాలా భూ పరిశీలన ఉపగ్రహాలను నింగిలోకి పంపింది.
దేశ భద్రత, సరిహద్దుల నిఘా కోసం పంపే శాటిలైట్లను ‘అన్వేష’ సిరీస్‌లో పంపాలని నిర్ణయించింది. శత్రవుల కదలికలపై పర్యవేక్షించడంతో పాటు వాతావరణ మార్పులు, తుపానులు, వరద తదితర ప్రకృతి విపత్తుల సమయంలో ముందస్తు సమాచారాన్ని అందిస్తుంది. వ్యవసాయం, అడవుల విస్తీర్ణంతో పాటు నీరు, భూమిలో తదితర అంశాల్లోనూ డేటాను అందించనున్నది. అలాగే, భూమి పొరల్లో ఉండే మూలకాలను సైతం గుర్తిస్తుంది. పీఎస్ఎల్‌వీ శాటిలైట్ అన్వేష శాటిలైట్‌తో పాటు 15 శాటిలైట్స్‌ను నింగిలోకి మోసుకెళ్లనున్నది. ఇందులో ఏడు యూరప్, ఐదు బ్రెజిల్‌కు, ఒకటి నేపాల్‌కు చెందింది ఉన్నాయి. చాలా వరకు ఈ ఉపగ్రహాలు విద్యాసంస్థలు, స్టార్టప్‌లకు చెందినవే.
తాజావార్తలు
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల






