ISRO | ఇస్రో ప్రైవేటీకరణ ఉండదు.. ఇస్రో చీఫ్ స్పష్టీకరణ
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ప్రైవేటీకరణ ఉండదని సంస్థ చీఫ్ డాక్టర్ వి. నారాయణన్ (Dr V. Narayanan) స్పష్టం చేశారు. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ విషయంలో ఉద్యోగుల ఆందోళనలను పరిష్కరిస్తామని తెలిపారు.
ISRO | త్రినేత్ర.న్యూస్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ప్రైవేటీకరణపై రకరకాలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై ఇస్రో చీఫ్ (Isro Chairman) డాక్టర్ వి. నారాయణన్ (Dr V. Narayanan) స్పందించారు. ఇస్రో ప్రైవేటీకరణ ఉండదని స్పష్టం చేశారు. సంస్థ ప్రాధాన్యతను తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఉద్యోగుల ఆందోళనలను పరిష్కరిస్తామని తెలిపారు. ఇస్రో భవిష్యత్తు, ఉద్యోగుల పాత్రపై కొన్ని ఉద్యోగ సంఘాలు అధికారిక స్పష్టత కోరిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
బెంగళూరు స్పేస్ ఎక్స్‌పో (Bengaluru Space Expo)లో ఆయన మాట్లాడారు. అంతరిక్ష రంగ సంస్కరణలు ఆరేళ్ల క్రితమే ప్రారంభమైనట్లు చెప్పారు. ప్రైవేట్ రంగానికి చేయూతనిస్తూ అంతరిక్ష రంగ వ్యవస్థను (ecosystem) వృద్ధి చేయడమే దీని ప్రధాన ఉద్దేశం అని నొక్కి చెప్పారు. భారత అంతరిక్ష కార్యక్రమంలో ప్రైవేట్ పరిశ్రమల పాత్ర ఎప్పటి నుంచో ఉందని పేర్కొన్నారు. పీఎస్ఎల్‌వీ, జీఎస్ఎల్‌వీ ప్రయోగానికి సంబంధించిన బడ్జెట్‌లో దాదాపు 80 శాతం మేర భారతీయ పరిశ్రమలే పెట్టుబడి పెడుతున్నాయని వివరించారు. సుమారు 450 పరిశ్రమలు తమతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
భారతదేశం తన ప్రయోగ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని ఈ సందర్భంగా నారాయణన్ తెలిపారు. దేశంలో లాంచ్ వెహికల్స్ అవసరం ఏటా సుమారు 50 దాకా ఉంటుందని అంచనా వేశారు. ఈ భారీ లక్ష్యాన్ని సాధించాలంటే ఇస్రోతో పాటు భారతీయ పరిశ్రమల భాగస్వామ్యం మరింతగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఇస్రో ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇస్రోలో మొత్తం 20,000 మంది ఉద్యోగులున్నారని చెప్పారు. ఉద్యోగులందరితో మాట్లాడి వారి ఆందోళనలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇస్రో ప్రాముఖ్యతను తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
Also Read..
విమానం 36 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. ఇంజిన్-1లో తగ్గిపోయిన ఆయిల్
టాక్సిక్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఓటీటీ రైట్స్ విషయంలో దారుణంగా..!
రేపు 1000 డప్పులతో కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తాం: దేవని సతీష్ మాదిగ
సంబంధిత వార్తలు

GSLV F17 mission | మరో ఆరు ప్రయోగాలే లక్ష్యం.. GSLV-F17 ప్రయోగం విజయవంతం వేళ గగన్‌యాన్ అప్డేట్ ఇచ్చిన ఇస్రో ఛైర్మన్
సెప్టెంబర్ 4, 2026

ISRO | నింగిలోకి నిఘానేత్రం.. విజయవంతంగా జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం
సెప్టెంబర్ 4, 2026

Jairam Ramesh | ఇస్రోను కేంద్రం బలహీనపరుస్తోంది.. జైరామ్ రమేష్
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Toxic Movie | టాక్సిక్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఓటీటీ రైట్స్ విషయంలో దారుణంగా..!
- ●Devani Sathish Madiga | రేపు 1000 డప్పులతో కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తాం: దేవని సతీష్ మాదిగ
- ●Chenab River Doda Suicide | తండ్రితో ఫోన్లో మాట్లాడుతూ.. 'బై బై నాన్న' అంటూ నదిలోకి దూకేసిన 20 ఏళ్ల యువతి
- ●Stock Markets | భౌగోళిక ఉద్రిక్తతల ఎఫెక్ట్.. 383 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..
- ●Air India Express | విమానం 36 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. ఇంజిన్-1లో తగ్గిపోయిన ఆయిల్
- ●MLA Vivekananda | రేవంత్ ముక్కు నేలకు రాసినా క్షమించని నేరం చేసిండు

Toxic Movie | టాక్సిక్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఓటీటీ రైట్స్ విషయంలో దారుణంగా..!

Devani Sathish Madiga | రేపు 1000 డప్పులతో కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తాం: దేవని సతీష్ మాదిగ

Chenab River Doda Suicide | తండ్రితో ఫోన్లో మాట్లాడుతూ.. 'బై బై నాన్న' అంటూ నదిలోకి దూకేసిన 20 ఏళ్ల యువతి

Stock Markets | భౌగోళిక ఉద్రిక్తతల ఎఫెక్ట్.. 383 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..



