Toxic Movie | టాక్సిక్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఓటీటీ రైట్స్ విషయంలో దారుణంగా..!
Toxic Movie | యశ్ హీరోగా తెరకెక్కిన ‘టాక్సిక్’కు వరుస షాక్‌లు తగులుతున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చినట్లు సమాచారం. తాజాగా ఓటీటీ డీల్ విషయంలోనూ మేకర్స్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Sep 7, 2026, 4.19 pm IST
Toxic Movie | యశ్ హీరోగా తెరకెక్కిన ‘టాక్సిక్’కు వరుస షాక్‌లు తగులుతున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చినట్లు సమాచారం. తాజాగా ఓటీటీ డీల్ విషయంలోనూ మేకర్స్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ హంగామా కథనం ప్రకారం.. ‘టాక్సిక్’ డిజిటల్ హక్కుల కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ తొలుత రూ.150 కోట్లు ఆఫర్ చేసిందట. అయితే మేకర్స్ మాత్రం రూ.200 కోట్లకుపైగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
రిలీజ్ తర్వాత మారిన సీన్..
థియేటర్లలో సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని, ఆ తర్వాత ఓటీటీ హక్కుల విలువ మరింత పెరుగుతుందని యశ్ భావించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. అయితే సినిమా ఫలితం అంచనాలకు భిన్నంగా ఉండటంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సమాచారం. ప్రస్తుతం ‘టాక్సిక్’ అన్ని భాషల డిజిటల్ హక్కులకు కలిపి రూ.30 కోట్ల వరకు మాత్రమే ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో అత్యధిక ఆఫర్ జీ5 నుంచి వచ్చినట్లు సమాచారం. థియేటర్లలో ఆశించిన స్పందన రాకపోవడంతో ఓటీటీ హక్కుల విషయంలోనూ భారీ మొత్తాన్ని రాబట్టడం కష్టంగా మారినట్లు తెలుస్తోంది.
ఓటీటీ కోసం కొత్తగా ఎడిట్?
డిజిటల్ రిలీజ్ కోసం ‘టాక్సిక్’ను కొంత మేరకు రీ-ఎడిట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. థియేట్రికల్ వెర్షన్‌లో వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ ప్రేక్షకులకు మరింత ఆకట్టుకునేలా కొన్ని మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. కొత్త ఎడిట్‌తో సినిమాపై ఆసక్తి పెంచడంతో పాటు డిజిటల్ రైట్స్‌కు మెరుగైన ధర దక్కుతుందని మేకర్స్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
భారీ అంచనాలతో వచ్చినా..
‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత దాదాపు రెండేళ్లకు యశ్ నటించిన సినిమా కావడంతో ‘టాక్సిక్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్ నుంచి మరో పాన్ ఇండియా హిట్ ఖాయమనే అంచనాలతో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే విడుదలైన తొలిరోజు నుంచే కథ, కథనం, ఇతర అంశాలపై మిశ్రమ స్పందనతో పాటు విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా రూ.326కోట్ల వరకు మాత్రమే వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.500కోట్ల నుంచి రూ.600కోట్ల వరకు ఉంటుందని అంచనా.
చర్చనీయాంశంగా...
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, రుక్మిణీ వసంత్, తారా సుతారియా, నయనతార కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు ఎక్కువగా ఉండటంతో.. థియేట్రికల్ ఫలితం, ఓటీటీ హక్కుల విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

NTR Movie | ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ మూవీపై క్రేజీ అప్డేట్.. ఇద్దరు భామలతో స్పెషల్ సాంగ్‌కు ప్లాన్!
సెప్టెంబర్ 6, 2026

Nayanthara | ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేసిన నయనతార – డబ్బుల కోసమే అంటూ నెటిజన్ల ట్రోల్స్
సెప్టెంబర్ 4, 2026

Rukmini Vasanth | డిజాస్టర్ల ఎఫెక్ట్ – రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన రుక్మిణి వసంత్
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Devani Sathish Madiga | రేపు 1000 డప్పులతో కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తాం: దేవని సతీష్ మాదిగ
- ●Chenab River Doda Suicide | తండ్రితో ఫోన్లో మాట్లాడుతూ.. 'బై బై నాన్న' అంటూ నదిలోకి దూకేసిన 20 ఏళ్ల యువతి
- ●Stock Markets | భౌగోళిక ఉద్రిక్తతల ఎఫెక్ట్.. 383 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..
- ●Air India Express | విమానం 36 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. ఇంజిన్-1లో తగ్గిపోయిన ఆయిల్
- ●MLA Vivekananda | రేవంత్ ముక్కు నేలకు రాసినా క్షమించని నేరం చేసిండు
- ●iQOO Z11xa 5G | ఐక్యూ జడ్11ఎక్స్ఏ 5జి వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..

Devani Sathish Madiga | రేపు 1000 డప్పులతో కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తాం: దేవని సతీష్ మాదిగ

Chenab River Doda Suicide | తండ్రితో ఫోన్లో మాట్లాడుతూ.. 'బై బై నాన్న' అంటూ నదిలోకి దూకేసిన 20 ఏళ్ల యువతి

Stock Markets | భౌగోళిక ఉద్రిక్తతల ఎఫెక్ట్.. 383 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..

Air India Express | విమానం 36 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. ఇంజిన్-1లో తగ్గిపోయిన ఆయిల్



