Viral Video | ‘నా డ్యూటీ అయిపోయింది.. నేను విమానం నడపను’
కొన్ని కారణాల వల్ల విమానం ఆలస్యం అయింది. బయటి నుంచి రావాల్సిన విమానం లేట్‌గా ల్యాండ్ కావడం, ఎయిర్ ట్రాఫిక్ కంజెషన్, సిబ్బంది డ్యూటీ టైమ్ పూర్తవడం లాంటి సమస్యల వల్ల ఆలస్యం అయిందని ప్రకటన విడుదల చేసింది.
Viral news | Published On Jan 16, 2026, 6.45 pm IST
Viral Video | నా డ్యూటీ అయిపోయింది.. ఇక నేను విమానం నడపను.. అంటూ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కిన ప్రయాణికులను పట్టించుకోకుండా ఓ పైలట్ చేసిన వింత చేష్టలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబై నుంచి థాయిలాండ్‌లోని క్రాబి అనే ప్రాంతానికి వెళ్తున్న ఇండిగో విమానంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
6ఈ 1085, ఇండిగో విమానం ఉదయం 4 గంటలకు ముంబై నుంచి బయలుదేరాలి. ప్రయాణికులు కూడా విమానం ఎక్కి పైలట్ ఎప్పుడు వస్తాడా? ఎప్పుడు విమానం టేకాఫ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇంతలో విమానం పైలట్ వచ్చి తన డ్యూటీ టైమ్ అయిపోయిందని.. తాను ఇప్పుడు విమానం నడపలేనని ప్యాసెంజర్లకు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. దీంతో విమానంలో ఉన్న పైలట్, సిబ్బందితో ప్రయాణికులు గొడవకు దిగారు. విమానం నడపకుండా వెళ్లిపోతే తమ పరిస్థితి ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు గంటల పాటు విమానంలోనే ప్రయాణికులు పడిగాపులు పడాల్సి వచ్చింది. కోపంతో కొందరు ప్రయాణికులు విమానం ఎగ్జిట్ డోర్‌ని కూడా తన్నారు. దీంతో ఇండిగో సంస్థ స్పందించి ఆ విమానాన్ని మూడు గంటలు ఆలస్యంగా థాయిలాండ్‌కి పంపించింది. కానీ.. విమాన సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించి, ఎగ్జిట్ డోర్‌ని కాళ్లతో తన్నిన ఇద్దరు ప్రయాణికులను వెంటనే కిందికి దించి సెక్యూరిటీ ఏజెన్సీకి అప్పగించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇండిగో సంస్థ స్పందించింది. కొన్ని కారణాల వల్ల విమానం ఆలస్యం అయింది. బయటి నుంచి రావాల్సిన విమానం లేట్‌గా ల్యాండ్ కావడం, ఎయిర్ ట్రాఫిక్ కంజెషన్, సిబ్బంది డ్యూటీ టైమ్ పూర్తవడం లాంటి సమస్యల వల్ల ఆలస్యం అయిందని ప్రకటన విడుదల చేసింది.
New:
-Pandemonium in @IndiGo6E flight from Mumbai to Krabi
-Passengers wanted to beat pilot
-Who is said to have refused to operate flight as he was breaching his duty time & had told airline in advance
-But flight was boarded & passengers were stuck inside for 3 hours
— Tarun Shukla (@shukla_tarun) January 15, 2026
సంబంధిత వార్తలు

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026

Mohali child kidnapping | దారుణం: తాతయ్య కళ్లెదుటే 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
మే 20, 2026

Amitabh Bachchan | నేను క్షేమంగానే ఉన్నా.. హాస్పిటల్లో చేరాడన్న వార్తలపై అమితాబ్ క్లారిటీ
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



