ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఉద్రిక్తత
దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దు అవడం, ఆలస్యం అవడం ఇంకా ఆగలేదు. ఇప్పటికే మూడు నాలుగు రోజులు దాటినా విమానాల రద్దు మాత్రం జరుగుతూనే ఉంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తాజాగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ విమానాలు రద్దు కావడంతో ఆగ్రహించిన ప్రయాణికులు ఇండిగో టికెట్ కౌంటర్ వద్ద సిబ్బందితో గొడవకు దిగారు.
ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన ఇండిగో విమానాల్లో చాలా విమానాలు రద్దయ్యాయి. శనివారం 100కు పైగా విమానాలు రద్దు అయ్యాయి. దీంతో విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇండిగో సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ కౌంటర్ల వద్ద ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిని నిలదీయడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇది ఒక ముంబై ఎయిర్‌పోర్ట్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న చాలా విమానాశ్రయాల్లో ఇదే పరిస్థితి. కొత్త పైలట్ రోస్టర్ నిబంధనల అమలులో లోపాల వల్లనే దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దు అవుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇండిగో విమానయాన సంస్థ విషయంలో సీరియస్ గా స్పందించింది. రద్దయిన విమానాలకు సంబంధించిన టికెట్ రుసుము రీఫండ్ వెంటనే చెల్లించాలని, విమాన టికెట్ ధరలను కూడా నియంత్రించాలని ఆదేశాలు జారీ చేసింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






