Gold Seized | ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో రూ.7.49కోట్ల విలువైన బంగారం సీజ్..!
Gold Seized | ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా పెద్ద ఎత్తున బంగారాన్ని తరలిస్తున్న ముఠాను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి తరలించిన 5.095 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.7.49 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
Gold Seized | ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా పెద్ద ఎత్తున బంగారాన్ని తరలిస్తున్న ముఠాను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి తరలించిన 5.095 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.7.49 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు. ఇందులో విమానాశ్రయంలోని వివిధ దుకాణాల్లో పని చేసే ముగ్గురు ఉద్యోగులు, ఫిలిప్పీన్స్‌కు చెందిన ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. దర్యాప్తులో బంగారం అక్రమ రవాణాకు సరికొత్త పద్ధతిని ఉపయోగిస్తున్నట్లుగా గుర్తించారు. బంగారం పొడిని మైదానంలో దాచి చిన్న ప్యాకెట్ల రూపంలో ఒకరి నుంచి మరొకరికి అందిస్తూ స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. పక్కా సమాచారం మేరకు రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు విమానాశ్రయంలోని పీ-4 లెవల్ వద్ద హిమాన్షు ఉపాధ్యాయ్ అనే ఉద్యోగి రెండు నల్లటి ప్యాకెట్లను మరో వ్యక్తికి అందజేస్తుండగా పట్టుకున్నారు.
విచారణలో ఈ ప్యాకెట్లను ‘సాక్స్ ఎక్స్‌ప్రెస్’ దుకాణ మేనేజర్ ఫిరోజ్ సయ్యద్ తనకు ఇచ్చినట్లు హిమాన్షు తెలిపాడు. దీంతో అధికారులు ఫిలిప్పీన్స్ నుంచి థాయ్‌లాండ్‌కు ట్రాన్సిట్‌లో వెళ్తున్న ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద కూడా ఇదే తరహా మైనం ప్యాకెట్లు దొరికాయి. పరిశీలనలో ఇందులో 24 క్యారెట్ల బంగారం ఉన్నట్లు తేలింది. అరెస్టైన నిందితులు విచారణలో ముఠా నిర్వాహకుడి ఆదేశాల మేరకు పని చేసినట్లు అంగీకరించారని డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారిని గుర్తించే పనిలో ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అరెస్టయిన ప్రయాణికులు తరఫు న్యాయవాదులు తమ క్లయింట్స్ కేవలం ట్రాన్సిట్ ప్రయాణికులేనని.. భారత్‌లోకి ప్రవేశించే ఉద్దేశం వారికి లేదంటూ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు నిందితులను రిమాండ్‌కు పంపింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Dasoju Sravan Press Meet | వైట్ కాలర్ క్రిమినల్ పొంగులేటి.. సీఎం పదవి కొనుక్కున్న రేవంత్
- ●Jajula Srinivas Goud | కాంగ్రెస్‌ను ప్రజలే బర్తరఫ్ చేస్తారు : జాజుల శ్రీనివాస్ గౌడ్
- ●Konda Murali | మీసం మెలేసిన కొండా మురళీ.. దేనికి సంకేతం..?
- ●Ranveer Singh | లగ్జరీ కారు కొన్న ధురంధర్ హీరో - బాలీవుడ్లో సెకండ్ సెలిబ్రిటీ
- ●Harish Rao vs Revanth Reddy | కాంగ్రెస్ 1000 రోజుల పాలన మొత్తం సెటిల్మెంట్లే.. దమ్ముంటే కౌడిపల్లికి రా..!
- ●Konda Surekha | నేను ఏ తప్పు చేయలేదు.. తలెత్తుకుని బతుకుతా.. ఎమ్మెల్యేగా కొనసాగుతా

Dasoju Sravan Press Meet | వైట్ కాలర్ క్రిమినల్ పొంగులేటి.. సీఎం పదవి కొనుక్కున్న రేవంత్

Jajula Srinivas Goud | కాంగ్రెస్‌ను ప్రజలే బర్తరఫ్ చేస్తారు : జాజుల శ్రీనివాస్ గౌడ్

Konda Murali | మీసం మెలేసిన కొండా మురళీ.. దేనికి సంకేతం..?

Ranveer Singh | లగ్జరీ కారు కొన్న ధురంధర్ హీరో - బాలీవుడ్లో సెకండ్ సెలిబ్రిటీ






