UPI Payments | భారతీయులకు గుడ్‌న్యూస్..! జపాన్‌లోనూ మన యూపీఐ సేవలు..!
UPI Payments | యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సేవలు అంతర్జాతీయంగా వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే భూటాన్, సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, శ్రీలంక, నేపాల్, మారిషస్, ఖతార్ సహా పలుదేశాల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి.
UPI Payments | యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సేవలు అంతర్జాతీయంగా వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే భూటాన్, సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, శ్రీలంక, నేపాల్, మారిషస్, ఖతార్ సహా పలుదేశాల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో దేశంలో సైతం యూపీఐ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దాంతో పర్యాటకులు, ప్రవాస భారతీయులు డిజిటల్ చెల్లింపులను సులభతరం చేసేందుకు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగడపనున్నది.
నిక్కీ ఏషియా నివేదిక ప్రకారం.. జపాన్ ఐటీ సేవల సంస్థ ఎన్‌టీటీ డేటాతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భాగస్వామ్య ఒప్పందం కుదురుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జపాన్‌లో ప్రయోగాత్మకంగా యూపీఐ పేమెంట్స్ సేవలను ప్రారంభించనున్నారు. విజయవంతమైతే ఆ తర్వాత జపాన్ వ్యాప్తంగా సేవలను అందుబాటులోకి వస్తాయి. దాంతో భారతీయులు తమ సొంత దేశ బ్యాంకు అకౌంట్ల నుంచే పేమెంట్స్ చేసే వీలు కలుగుతుంది. జపనీస్, ఇండియన్ పేమెంట్స్ నెట్‌వర్క్‌ను అనుసంధానించే మార్గాలను కంపెనీలు పరిశీలిస్తున్నాయని నివేదిక తెలిపింది. వాస్తవానికి జపాన్‌కు భారత్ నుంచి ఏటా సుమారు 3.15లక్షల మంది సందర్శిస్తారు. ఇది గతేడాదితో పోలిస్తే 35శాతం ఎక్కువ. భారతీయ పర్యాటకులను ఆకర్షించే ఉద్దేశంతో యూపీఐ సేవలను విస్తరించనున్నారు.
మధ్య తరగతి ఆదాయం పెరుగుతుండడంతో విదేశీ పర్యటనలపై ఆసక్తి పెరుగుతోందని నివేదిక తెలిపింది. భారత్ నుంచి విదేశాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య 2022లో 13 మిలియన్లు ఉండగా.. 2040 నాటికి 90 మిలియన్లకు చేరుతుందని మెకిన్సే అంచనా వేసినట్లుగా నివేదిక పేర్కొంది. 2016లో కేంద్రం చొరవతో ప్రారంభమైన యూపీఐ సేవలు ప్రస్తుతం దైనందితన జీవితంలో భాగంగా మారాయి. ఒకే క్యూఆర్ కోడ్‌ను చెల్లింపుల అప్లికేషన్స్ ద్వారా ఉపయోగించేందుకు అనుమతి ఉంటుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు 42 శాతం పెరిగి 185.8 బిలియన్లకు చేరుకున్నాయి. జూన్ 2025లో ఐఎంఎఫ్ నివేదిక ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థగా అభివర్ణించింది.
2021లో ఎన్‌పీసీఐ, భారత ప్రభుత్వం తొలిసారిగా భూటాన్‌లో యూపీఐ సేవలను ప్రారంభించాయి. ఆ తర్వాత సింగపూర్, ఫ్రాన్స్, శ్రీలంక, యూఏఈతో సహా ఎనిమిది దేశాలకు సేవలను విస్తరించింది. పెరూ, నమీబియా వంటి దేశాలు యూపీఐ సేవలను ప్రారంభించేందుకు సహకారం అందిస్తున్నాయి. యూఎస్ చెల్లింపుల సంస్థ వరల్డ్‌పే ప్రకారం.. 2024లో భారతదేశంలో స్టోర్లలో జరిగే చెల్లింపులలో యూపీఐ వాటా 58 శాతంగా ఉంది. 2030 నాటికి ఇది 76 శాతానికి పెరగనుంది. అదే సమయంలో నగదు లావాదేవీలు 15 శాతం నుంచి 7 శాతానికి తగ్గే అవకాశం ఉంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






