SFDR | భారత్ మరో ఘనత.. ఎస్‌ఎఫ్‌డీఆర్ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో..!
SFDR | దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో భారత్ మరో ఘనత సాధించింది. ఎయిర్ టూ ఎయిర్ లాంగ్ రేంజ్ మిస్సైల్ తయారీలో కీలకమైన సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ (SFDR) టెక్నాలజీని డీఆర్డీవో మంగళవారం విజయవంతంగా పరీక్షించింది.
SFDR | దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో భారత్ మరో ఘనత సాధించింది. ఎయిర్ టూ ఎయిర్ లాంగ్ రేంజ్ మిస్సైల్ తయారీలో కీలకమైన సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ (SFDR) టెక్నాలజీని డీఆర్డీవో మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా చాందీపూర్ సమీపంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి ఫిబ్రవరి ఉదయం 10.45 గంటలకు ప్రయోగం చేపట్టింది. టెస్ట్ ప్రక్రియలో భాగంగా ముందుగా భూమిపై అమర్చిన నాజిల్-లెస్ బూస్టర్ మోటార్ సహాయంతో వ్యవస్థను అవసరమైన మ్యాక్ వేగాన్ని సాధించింది.
సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ మోటార్‌తో పాటు ఫ్యూయల్ ఫ్లో కంట్రోలర్ తదితర అన్ని ప్రధాన ఉపవ్యవస్థలు సమర్థవంతంగా పనిచేశాయని డీఆర్డీవో వెల్లడించింది. ఈ ప్రయోగాన్ని బంగాళాఖాతం తీరప్రాంతం వెంబడి ఏర్పాటు చేసిన అత్యాధునిక ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా పర్యవేక్షించారు. ఫ్లైట్ డేటాను విశ్లేషించిన అనంతరం, పరీక్ష అన్ని లక్ష్యాలను విజయవంతంగా సాధించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కీలక టెస్ట్‌ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ (DRDL), హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (HEMRL), రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI), అలాగే ఐటీఆర్‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఈ విజయం దేశ రక్షణ వ్యవస్థలకు మరింత బలం చేకూరుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శి, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ ఈ ఫ్లైట్ టెస్ట్‌లో పాలుపంచుకున్న బృందాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్‌డీఆర్ఎఫ్ ప్రొపల్షన్ వ్యవస్థ సాధించిన విజయంతో శత్రు లక్ష్యాలను అత్యంత దూరం నుంచే ఎదుర్కొనే సామర్థ్యం గల ఆధునిక క్షిపణుల అభివృద్ధిలో భారత్ ఒక కీలక మైలురాయిని అధిగమించింది. ఈ సాంకేతికత భారత వైమానిక దళానికి గణనీయమైన వ్యూహాత్మక ఆధిక్యం అందించనుంది. ఈ టెస్ట్‌తో ఎస్ఎఫ్‌డీఆర్ సాంకేతికతను స్వదేశీంగా అభివృద్ధి చేయగలిగిన కొద్దిదేశాల సరసన భారత్ నిలిచింది.
తాజావార్తలు
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల






