India’s first offshore Airport | ఇండియాలో మరో అద్భుతం.. సముద్రంలో భారీ విమానాశ్రయం..!
India’s first offshore Airport | త్రినేత్ర.న్యూస్ : శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్న ఇండియా మరో అద్భుతం సృష్టించేందుకు సిద్ధమైంది. మౌలిక సదుపాయాల రంగంలో మరో చారిత్రాత్మక అడుగు వేసే దిశగా భారత్ ముందుకు వెళ్తోంది. సముద్రంలో భారీ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోంది.
India’s first offshore Airport | త్రినేత్ర.న్యూస్ : శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్న ఇండియా మరో అద్భుతం సృష్టించేందుకు సిద్ధమైంది. మౌలిక సదుపాయాల రంగంలో మరో చారిత్రాత్మక అడుగు వేసే దిశగా భారత్ ముందుకు వెళ్తోంది. సముద్రంలో భారీ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇవ్వనుంది. మరి ఈ ఎయిర్‌పోర్టును ఎక్కడ నిర్మిస్తున్నారు..? ఆ విమానాశ్రయం ప్రత్యేకతలు ఏంటి..? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
మన దేశంలో ఎన్నో ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. అధునాతన సదుపాయాలతో అద్భుతమైన విమానాశ్రయాలు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. కానీ దేశంలోనే తొలిసారిగా ఆఫ్ షోర్ ఎయిర్‌పోర్టును నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఈ విమానాశ్రయం నిర్మాణానికి మహారాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లా తీరంలో ఉన్న వధవన్ వద్ద ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.
మరి ఈ ఎయిర్‌పోర్టు ప్రత్యేకత ఏంటంటే..?
ఈ విమానాశ్రయం భూమి మీద కాకుండా.. అరేబియా సముద్రంలో కృత్రిమంగా సృష్టించిన ద్వీపంలో నిర్మితం కానుంది. ఇండియాలో ఇప్పటి వరకు ఇలాంటి సాహసోపేతమైన ఇంజినీరింగ్ అద్భుతం ఎప్పుడూ జరగలేదు. ముంబై లాంటి మెట్రో నగరాల్లో భూమి కొరత కారణంగా.. సముద్రాన్ని భూమిగా మార్చి ఎయిర్‌పోర్టు నిర్మించడం అనేది భారత మౌలిక సదుపాయాల రంగంలో విప్లవాత్మక నిర్ణయం అని చెప్పొచ్చు.
ఖర్చు ఎంతంటే..?
సముద్రంలో నిర్మించబోయే ఈ ఎయిర్‌పోర్టు అంచనా వ్యయం సుమారు రూ. 45 వేల కోట్లు. ఇందులో సగం డబ్బు అంటే రూ. 25 వేల కోట్లు ఖర్చు పెట్టి.. సముద్రంలో భూమిని సృష్టించనున్నారు. అంటే ప్రాజెక్టు వ్యయంలో సగానికి పైగా కేవలం భూమి తయారీకే వినియోగిస్తున్నారు. మిగిలిన రూ. 20 వేల కోట్లతో టెర్మినల్స్, రన్‌వేలు, ఇతర అత్యాధునిక సదుపాయాలను కల్పించనున్నారు.
జపాన్ తరహాలో..
జపాన్‌లోని కన్సాయ్ లేదా హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయాల తరహాలో ఈ వధవన్ ఎయిర్‌పోర్టును నిర్మించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఆఫ్ షోర్ ఎయిర్‌పోర్టులు చాలా తక్కువగా ఉన్నాయి. వధవన్ వద్ద ఈ ఎయిర్‌పోర్టు నిర్మితమైతే భారత్ కూడా ప్రపంచ దేశాల సరసన చేరబోతోంది.
9 కోట్ల మంది ప్రయాణికులు..
వధవన్ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే.. ప్రతి ఏటా సుమారు 9 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించే వీలు ఉంటుంది. అప్పుడు ఇండియాలోని అతి పెద్ద విమానాశ్రయాల్లో ఒకటి ఇది నిలుస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా ఈ ఎయిర్‌పోర్టు ప్రధాన కేంద్రంగా మారబోతోంది. ఏటా 3 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేసే విధంగా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అద్భుతమైన కనెక్టివిటీ..

వధవన్ ఎయిర్‌పోర్టును కేవలం గగన తలానికే పరిమితం చేయరు. రోడ్డు, రైలు, సముద్ర మార్గాలతో అనుసంధానం చేయనున్నారు. గ్రీన్ ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ వధవన్ పోర్ట్‌తో ఈ ఎయిర్‌పోర్టు నేరుగా అనుసంధానమై ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారత తొలి ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్‌తో పాటు వెస్ట్రన్ రైల్వే మెట్రో లింక్‌ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. వడోదర-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, ఉత్తన్-విరార్ సీ లింక్ ద్వారా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌కు వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు.
దేశ జీడీపీలో కీలక పాత్ర
మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రి-ఫీజిబిలిటీ స్టడీని దాదాపు పూర్తి చేసింది. ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ లో కీలక భాగం కానుంది. వధవన్ పోర్ట్ ద్వారా వచ్చే భారీ కంటైనర్లు, ఇక్కడి విమానాశ్రయం ద్వారా జరిగే ఎగుమతులు దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Pak Ship Collides With Indian Navy Unit | అంతర్జాతీయ జలాల్లో అనూహ్య పరిణామం.. భారత నౌకను ఢీ కొట్టిన పాక్ నౌక
సెప్టెంబర్ 16, 2026

Rhiya Yadav | ముంబై యువతి తెగువ.. పోలీసు వాహనాన్ని అడ్డుకుని.. ఎవరీ రియా యాదవ్..?
జులై 23, 2026

WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..
జులై 8, 2026
తాజావార్తలు
- ●Vote For Notes Case Supreme Court | సుప్రీంకోర్టులో 'ఓటుకు కోట్లు' కేసు విచారణ.. గంటన్నరపాటు సాగిన లూత్ర వాదనలు
- ●Jairam Ramesh | నోటాకు ప్రధాని కొత్త అర్థం చెప్పారు.. యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
- ●Bandi Sanjay Karimnagar | కవులు, కళాకారుల పుట్టిల్లు కరీంనగర్
- ●Malavika Mohanan | మాళవికకు వరుస ఫ్లాపులు.. ఈ ఏడాది కలిసిరాని భారీ బడ్జెట్ సినిమాలు..!
- ●Saifabad Police Station Attack | సైఫాబాద్ పీఎస్‌లో దాడి నిజమే.. హైకోర్టులో అంగీకరించిన ప్రభుత్వం
- ●OPPO K14 Lite | 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో కె14 లైట్.. ధర ఎంతంటే..

Vote For Notes Case Supreme Court | సుప్రీంకోర్టులో 'ఓటుకు కోట్లు' కేసు విచారణ.. గంటన్నరపాటు సాగిన లూత్ర వాదనలు

Jairam Ramesh | నోటాకు ప్రధాని కొత్త అర్థం చెప్పారు.. యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు

Bandi Sanjay Karimnagar | కవులు, కళాకారుల పుట్టిల్లు కరీంనగర్

Malavika Mohanan | మాళవికకు వరుస ఫ్లాపులు.. ఈ ఏడాది కలిసిరాని భారీ బడ్జెట్ సినిమాలు..!



