త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amitabh Bachchan | నేను క్షేమంగానే ఉన్నా.. హాస్పిట‌ల్లో చేరాడ‌న్న‌ వార్త‌ల‌పై అమితాబ్ క్లారిటీ

Amitabh Bachchan | బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan) ఆరోగ్యంపై ఊహాగానాలకు తెరపడింది. తాను క్షేమంగా ఉన్నానంటూ బిగ్‌బీ వెల్ల‌డించారు.

G

Entertainment | Published On May 20, 2026, 9.29 am IST

Amitabh Bachchan | నేను క్షేమంగానే ఉన్నా.. హాస్పిట‌ల్లో చేరాడ‌న్న‌ వార్త‌ల‌పై అమితాబ్ క్లారిటీ
Advertisement

Amitabh Bachchan | త్రినేత్ర‌.న్యూస్‌: బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan) ఆరోగ్యంపై ఊహాగానాలకు తెరపడింది. తాను క్షేమంగా ఉన్నానంటూ బిగ్‌బీ వెల్ల‌డించారు. అభిమానాలు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదంటూ.. ‘ప్రేమ, ప్రార్థనలు.. ఇంకా మరెన్నో..’ అంటూ త‌న బ్లాగ్‌లో పోస్టు పెట్టారు.

కాగా, ముంబైలోని నానావ‌తి ద‌వాఖాన‌లో (Hospitalization) అమితాబ్ చేరిన‌ట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి. అయితే ఆయ‌న మే 16న హాస్పిట‌ల్‌కు వెళ్లిన విష‌యం వాస్త‌వ‌మేన‌ని, అది కేవ‌లం రొటీన్ చెక‌ప్ కోస‌మేన‌ని బిగ్‌బీ స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. పరీక్షలు పూర్తయిన అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేశారని తెలిపాయి. త‌న వ్య‌క్తిగ‌త వైద్యుడు, గ్యాస్ట్రోఎంట‌రాల‌జిస్ట్ అయిన డాక్ట‌ర్ జ‌యంత్ బ‌ర్వే ఆయ‌న‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించార‌ని పేర్కొన్నాయి. 83 ఏండ్ల బ‌చ్చ‌న్ ప్ర‌స్తుతం ప్ర‌భాస్ క‌ల్కి సీక్వెల్‌తోపాటు సెక్ష‌న్ 84 అనే మూవీలో న‌టిస్తున్నారు.

 

Advertisement
Advertisement