Gadala Srinivasa Rao | జనసేన తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా గడల శ్రీనివాసరావు
Gadala Srinivasa Rao | జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ గడల శ్రీనివాసరావును నియమించారు. తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ తెలిపింది.
Gadala Srinivasa Rao | జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ గడల శ్రీనివాసరావును నియమించారు. తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ తెలిపింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడంలో గడల శ్రీనివాసరావు కీలకంగా వ్యవహరించనున్నారు. పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో జనసేన శ్రేణులను బలోపేతం చేసే బాధ్యతలను ఆయన నిర్వర్తించనున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ పరిధిలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్‌గా పనిచేసిన గడల శ్రీనివాసరావు.. స్టేట్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలను నిర్వహించారు. ఆయనకు ఉన్న పరిపాలనా అనుభవం తెలంగాణలో జనసేన పార్టీని రాజకీయ ప్రత్యామ్నాయ దిశగా తీసుకెళ్లడంలో ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గడల శ్రీనివాసరావు నియామకంతో పార్టీ సంస్థాగత కార్యక్రమాలకు మరింత ఊతం లభిస్తుందని, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తాయని జనసేన ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
- ●Garuda Seva | తిరుమలలో ఒకే నెలలో రెండోసారి గరుడసేవ
- ●No UPI Day October 2 | అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా 'నో యూపీఐ డే' : ఆన్లైన్ పేమెంట్స్ బంద్.. షాపుల్లో కేవలం క్యాష్ మాత్రమే!
- ●Night Traffic | ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో రాత్రిపూట వాహనాలకు నో ఎంట్రీ..!
- ●Jagtial CDPO ACB Trap | అంగన్వాడీ కేంద్రాలపై నెలవారీ మామూళ్లు: రూ.63,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెట్పల్లి సీడీపీవో
- ●Borabanda Belt Shop PD Act | ఆడవాళ్లైతే ఏంది?... తప్పుడు పనులు చేస్తే.. బయటికి రాకుండా జైలు
- ●Best Selling EVs | టాటా పంచ్‌ను దాటేసిన మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్

Garuda Seva | తిరుమలలో ఒకే నెలలో రెండోసారి గరుడసేవ

No UPI Day October 2 | అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా 'నో యూపీఐ డే' : ఆన్లైన్ పేమెంట్స్ బంద్.. షాపుల్లో కేవలం క్యాష్ మాత్రమే!

Night Traffic | ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో రాత్రిపూట వాహనాలకు నో ఎంట్రీ..!

Jagtial CDPO ACB Trap | అంగన్వాడీ కేంద్రాలపై నెలవారీ మామూళ్లు: రూ.63,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెట్పల్లి సీడీపీవో




