Indian Origin Woman | అమెరికా స్టోర్‌లో భారతీయ మహిళ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగుడు
Indian Origin Woman | అమెరికాలో ఓ భారతీయ మహిళ (Indian Origin Woman) దారుణ హత్యకు గురయ్యారు. మృతురాలు గుజరాత్ (Gujarat)కు చెందిన మేఘనా పటేల్ (Meghna Patel)గా గుర్తించారు.
Indian Origin Woman | అమెరికాలో ఓ భారతీయ మహిళ (Indian Origin Woman) దారుణ హత్యకు గురయ్యారు. ఓ స్టోర్‌లో (US Store) ఉండగా ఆమెపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సదరు మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు గుజరాత్ (Gujarat)కు చెందిన మేఘనా పటేల్ (Meghna Patel)గా గుర్తించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ మెహసానా జిల్లాలోని జంత్రాల్ గ్రామానికి చెందిన మేఘనా పటేల్ కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె ఓ దుకాణంలోపల ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ట్రాక్‌సూట్, జాకెట్, గ్లోవ్స్, ఫేస్ మాస్క్, టోపీ ధరించిన వ్యక్తి స్టోర్‌లోకి ఎంటరయ్యాడు. తొలుత అక్కడే ఉన్న మేఘనాతో ఏదో మాట్లాడాడు. కాసేపటికే ఆమెపై కాల్పులు జరిపి.. టేబుల్‌పై ఉన్న వస్తువును తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దోపిడీ చేసే ఉద్దేశంతోనే (Robbery Angle Suspected) దుండగుడు మహిళపై కాల్పులు జరిపి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
తాజావార్తలు
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..
- ●India-Pakistan Border | విద్యుత్‌దీపాలతో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డర్.. ఆకట్టుకుంటున్న వీడియో

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?






