త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Army Recruitment | ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు ఇండియ‌న్ ఆర్మీలో ఉద్యోగాలు..

మీరు ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. దేశ సేవ చేయాల‌నుకుంటున్నారా?.. అయితే మీకోసం ఇండియ‌న్ ఆర్మీ (Indian Army Recruitment) మంచి అవ‌కాశం క‌ల్పించింది.

G

National | Published On Jan 8, 2026, 1.52 pm IST

Indian Army Recruitment | ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు ఇండియ‌న్ ఆర్మీలో ఉద్యోగాలు..
Advertisement

trinethra.news: మీరు ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. దేశ సేవ చేయాల‌నుకుంటున్నారా?.. అయితే మీకోసం ఇండియ‌న్ ఆర్మీ (Indian Army Recruitment) మంచి అవ‌కాశం క‌ల్పించింది. షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (SSC) ద్వారా ఆర్మీలోకి ఎంట్రీ (SSC Tech) క‌ల్పిస్తున్న‌ది. ఇందులో భాగంగా ఎస్ఎస్‌సీ టెక్ రిక్రూట్‌మెంట్ (SSC Tech Recruitment) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీనిద్వారా 379 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ది. ఇంజినీరింగ్ పూర్తిచేసిన అవివాహిత‌ అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

మొత్తం ఉద్యోగాలు: 379 (పురుషుల‌కు 350, మ‌హిళ‌ల‌కు 29)
సివిల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, మెకానిక‌ల్, ఇత‌ర ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి సంబందిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేయాలి. 2026 అక్టోబ‌ర్ 1 నాటికి 20 నుంచి 27 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్కులై ఉండాలి. అదేవిధంగా అవివాహితులై ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: ఎలాంటి ఫిజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: పురుష అభ్య‌ర్థుల‌కు ఫిబ్ర‌వ‌రి 5, మ‌హిళ‌ల‌కు ఫిబ్ర‌వ‌రి 4
స‌ర్వీస్ సెలెక్ష‌న్ టెస్ట్‌: మార్చి 2026
పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in

Advertisement

తాజావార్తలు

Advertisement