SATHEE App | JEE, NEET అభ్యర్థులకు ఉచిత లెర్నింగ్ యాప్.. ప్రవేశపెట్టిన కేంద్రం..
SATHEE App | జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులు సులభంగా సిద్ధం కావడానికి కేంద్ర విద్యాశాఖ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్‌తో కలిసి సాథీ (SATHEE) పేరిట ఉచిత విద్యా యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET), కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావచ్చు.
Technology | Published On Mar 15, 2026, 3.22 pm IST
SATHEE App | జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులు సులభంగా సిద్ధం కావడానికి కేంద్ర విద్యాశాఖ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్‌తో కలిసి సాథీ (SATHEE) పేరిట ఉచిత విద్యా యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET), కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావచ్చు. SATHEE అంటే Self-Assessment, Test and Help for Entrance Exams అని అర్థం వస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఐఐటీలు, ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకు చెందిన నిపుణులు రూపొందించిన వీడియో లెక్చర్లు, అధ్యయన నోట్స్ అందుబాటులో ఉంటాయి. అదనంగా బహుభాషల్లో విద్యా వనరులను పూర్తిగా ఉచితంగా అందించే విధంగా ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు.
ఏఐతో అనుసంధానం..
ఇటీవల ఈ యాప్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా విడుదల చేసిన రియల్-వరల్డ్ ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఇన్ ఎడ్యుకేషన్ కేస్‌బుక్‌లో SATHEE యాప్‌ను ప్రస్తావించారు. అదే సందర్భంగా ఈ ప్లాట్‌ఫామ్‌కు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత కొత్త వెర్షన్‌ను కూడా ప్రకటించారు. ఈ కొత్త వెర్షన్‌లో పరీక్షల కోసం సిద్ధమయ్యే విద్యార్థులకు మరింత ఉపయోగపడే ఆధునిక ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ యాప్‌లో మాక్ టెస్టులు, అంచనా పరీక్షలు, విస్తృతమైన అధ్యయన విషయాలు, గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా విద్యార్థులు తమ సన్నద్ధత స్థాయిని అంచనా వేసుకోవచ్చు.
పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగం..
ఈ కార్యక్రమం ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఖరీదైన కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా కూడా పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఇది సహాయపడుతుందని అన్నారు. విద్యార్థులు ఎప్పుడైనా ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవచ్చు కనుక తమకు అనుకూలమైన సమయాల్లో చదువుకునే అవకాశం ఉంటుందన్నారు. జేఈఈ, నీట్, సీయూఈటీ పరీక్షలతోపాటు ఇతర పోటీ పరీక్షలకు కూడా ఈ యాప్ ద్వారా సిద్ధం కావచ్చని తెలిపారు. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) పరీక్షలు, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) పరీక్షలు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) పరీక్షలు, ఐసీఏఆర్ (ICAR) పరీక్షలకు కూడా ఈ యాప్ ద్వారా ప్రిపేర్ కావచ్చు. ఇక SATHEE యాప్ మాత్రమే కాకుండా వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చు.
సందేహాలకు సమాధానాలు పొందే వీలు..
ఈ ప్లాట్‌ఫామ్‌లో విద్యార్థులు తమ సందేహాలకు పరిష్కారాలను కూడా పొందవచ్చు. పరీక్షల విధానంలో జరిగే మార్పులను అనుసరించి ఇందులోని కంటెంట్‌ను తరచుగా మార్పు చేస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా సులభంగా ఉపయోగించుకునేలా యాప్‌ను సరళంగా, అందుబాటులో ఉండే విధంగా రూపొందించారు. విద్యార్థులు వెబ్‌లో అయితే sathee.iitk.ac.in అనే సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఇక యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లు రెండింటిపైనా అందుబాటులో ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IIT placements 2026 | ఐఐటీల్లో ఏఐ జాబ్స్ జోరు.. ఆ నైపుణ్యం ఉంటేనే ఆఫర్!
అక్టోబర్ 17, 2026

MLC Dasoju Sravan | నిరుద్యోగుల మొర వినండి.. బేషజాలకు పోకుండా పరీక్షల తేదీలు మార్చండి
అక్టోబర్ 17, 2026

Railway Station Master | రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు కనీస వయస్సు 20 ఏండ్లకు పెంపు..
అక్టోబర్ 17, 2026
తాజావార్తలు
- ●Maheshkumar Goud | ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మిత్రపక్షాలతో మాట్లాడతాం: మహేశ్‌కుమార్ గౌడ్
- ●Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్‌రెడ్డి
- ●Ranabaali Vs Jailer 2 | రణబాలి వర్సెస్ జైలర్ 2 - రజనీకాంత్, విజయ్ దేవరకొండ మధ్య గట్టిపోటీ - ఎక్కువ కలెక్షన్స్ దేనికంటే?
- ●DK Shivakumar | ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి బలం.. యువ న్యాయవాదులతో డీకే శివకుమార్
- ●Bathukamma Song in Dubai | ‘ఎడారిలో తంగేడు వనమే మొలిసేనో’.. దుబాయ్‌లో ‘మిట్టపల్లి’ బతుకమ్మ పాట ఆవిష్కరణ
- ●Land Survey | మూడు దశల్లో సమగ్ర భూసర్వే.. ఆధార్ తరహాలో భూదార్ కార్డులు

Maheshkumar Goud | ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మిత్రపక్షాలతో మాట్లాడతాం: మహేశ్‌కుమార్ గౌడ్

Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్‌రెడ్డి

Ranabaali Vs Jailer 2 | రణబాలి వర్సెస్ జైలర్ 2 - రజనీకాంత్, విజయ్ దేవరకొండ మధ్య గట్టిపోటీ - ఎక్కువ కలెక్షన్స్ దేనికంటే?

DK Shivakumar | ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి బలం.. యువ న్యాయవాదులతో డీకే శివకుమార్



