త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SSC CHTE | హిందీ ట్రాన్స్‌లేట‌ర్ ఉద్యోగాలు.. SSC CHTE నోటిఫికేష‌న్

SSC CHTE | దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో హిందీ ట్రాన్స్‌లేటర్ (Hindi Translator) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (SSC) కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 (SSC CHTE) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

G

National | Published On Apr 24, 2026, 8.17 am IST

SSC CHTE | హిందీ ట్రాన్స్‌లేట‌ర్ ఉద్యోగాలు.. SSC CHTE నోటిఫికేష‌న్
Advertisement

SSC CHTE | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో హిందీ ట్రాన్స్‌లేటర్ (Hindi Translator) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (SSC) కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 (SSC CHTE) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దాదాపు 84 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు మే 14లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. ఎంపికైన‌వారు నెల‌కు రూ.1,12,400 జీతం అందుకోవ‌చ్చు.

మొత్తం పోస్టులు: 80 (ప‌రీక్ష తేదీనాటి పోస్టుల సంఖ్య పెర‌గ‌వ‌చ్చు)

ఇందులో జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్ (JTO), జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌ (JHT), జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ (JT), సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌ (SHT), సీనియర్ ట్రాన్స్‌లేటర్‌ ఆఫీసర్ (STO) పోస్టులు ఉన్నాయి.

అర్హ‌త‌లు

హిందీ, ఇంగ్లిష్ స్పెషలైజేషన్‌లో మాస్టర్ డిగ్రీ లేదా డిగ్రీ స్థాయిలో హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు హిందీ, ఇంగ్లిష్‌లో ట్రాన్స్‌లేషన్‌ డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ట్రాన్స్‌లేటర్‌గా అనుభవం ఉండాలి.

అభ్యర్ధులు మే 14 నాటికి 18 నుంచి 30 ఏండ్ల‌ మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్ధులకు మూడేండ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేండ్ల‌ వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం..

కంప్యూట‌ర్ బేస్డ్ ఎగ్జామ్‌. రెండు పేప‌ర్లు ఉంటాయి. పేప‌ర్ 1 (కంప్యూట‌ర్ బేస్డ్ ఎగ్జామ్‌) 200 ప్ర‌శ్న‌లు, ప్ర‌తి ప్ర‌శ్న‌కు 1 ఒక మార్కు చొప్పున ఉంటుంది. పేప‌ర్ 2 (డిస్క్రిప్టివ్ ట్రాన్స్‌లేష‌న్ అండ్ ఎస్సే) 200 ప్ర‌శ్న‌లు అడుగుతారు. 2 గంట‌ల్లో ప‌రీక్ష పూర్తిచేయాల్సి ఉంటుంది. ప‌రీక్ష‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగా అభ్య‌ర్థులను ఎంపిక చేయ‌డంతోపాటు, డిపార్టుమెంటును కేటాయిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: మే 14
పేప‌ర్‌-1 ప‌రీక్ష‌: ఆగ‌స్టు-సెప్టెంబ‌ర్‌లో
వెబ్‌సైట్‌: https://ssc.gov.in/

Advertisement
Advertisement