గత కొన్ని రోజులుగా గోవా నైట్‌క్లబ్ ప్రమాదం గురించే దేశవ్యాప్తంగా చర్చ. ఓవైపు నైట్‌క్లబ్‌కి మంటలు అంటుకొని కాలిపోతుంటే.. మరోవైపు ఓనర్స్ మాత్రం థాయ్‌లాండ్‌కి టికెట్లు బుక్ చేసుకొని తమకేమీ తెలియదు అన్నట్టుగా అక్కడికి చెక్కేశారు. దీంతో ఓనర్స్‌పై దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈనేపథ్యంలో థాయ్‌లాండ్‌లో ఉన్న ఇద్దరు అన్మదమ్ములను భారత్‌కి తిరిగి రప్పించేందుకు భారత్ అస్త్రాలను ప్రయోగించాల్సి వచ్చింది. అందులో ఒకటి పాస్‌పోర్ట్ లా. పాస్‌పోర్ట్ యాక్ట్‌లోని సెక్షన్ 10ఏ కింద సౌరబ్, గౌరవ్ లుత్రా ఇద్దరి పాస్‌పోర్ట్‌లను కేంద్రం సస్పెండ్ చేసింది. దీంతో థాయ్‌లాండ్‌లో వాళ్లు చట్టాన్ని అత్రికమించి ఉండటమే అవుతుంది. థాయ్ పోలీసులు కూడా వెంటనే స్పందించి లుత్రా బ్రదర్స్‌ను డిటెయిన్ చేసే విషయంలో భారత్‌కు మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం ఇద్దరు అన్నదమ్ములు థాయ్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. భారత అధికారులు థాయ్‌లాండ్ వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇద్దరు అన్నదమ్ములది ఢిల్లీ. రోమియో లేన్ అనే రెస్టారెంట్ చైన్ ఔట్ లెట్స్ వీళ్లవే. దేశవ్యాప్తంగా 22 నగరాల్లో వీళ్ల రెస్టారెంట్స్ ఉన్నాయి. నాలుగు దేశాల్లో కూడా విస్తరించి ఉన్నాయి. థాయ్‌లాండ్ పారిపోయిన తర్వాత ఇద్దరు అన్నదమ్ములు ఢిల్లీ కోర్టులో ముందస్తు బెయిల్‌కు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తమకు ఆ రెస్టారెంట్‌కి సంబంధించిన లైసెన్స్ మాత్రమే ఉందని, ఆ బిల్డింగ్ ఓనర్స్ తాము కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకే తాము భారత్ వచ్చాక వెంటనే అదుపులోకి తీసుకోకుండా నాలుగు వారాల గడువు కావాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాము థాయ్‌లాండ్‌కు బిజినెస్ మీటింగ్ పని మీద మాత్రమే వెళ్లామని, క్లబ్‌లో అగ్ని ప్రమాదం జరగడం వల్ల కాదని పిటిషన్‌లో స్పష్టం చేశారు. ఆ ఘటన జరిగినప్పుడు తాము క్లబ్‌లో లేమని వెల్లడించారు.