Food Delivery | ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని.. డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో
Food Delivery | ఇటీవలి కాలంలో చాలా మంది తమకు కావాల్సిన వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే ఓ ఇద్దరు దంపతులు కూడా తమకు కావాల్సిన ఫుడ్‌ను జొమాటోలో ఆర్డర్ పెట్టారు. ఆ ఆర్డర్ కాస్త ఆలస్యమైంది. ఇంకేముంది.. డెలివరీ బాయ్‌పై దంపతులిద్దరూ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
Food Delivery | త్రినేత్ర న్యూస్ : ఇటీవలి కాలంలో చాలా మంది తమకు కావాల్సిన వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే ఓ ఇద్దరు దంపతులు కూడా తమకు కావాల్సిన ఫుడ్‌ను జొమాటోలో ఆర్డర్ పెట్టారు. ఆ ఆర్డర్ కాస్త ఆలస్యమైంది. ఇంకేముంది.. డెలివరీ బాయ్‌పై దంపతులిద్దరూ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన జరిగింది ఎక్కడో కాదు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోనే.
కంటోన్మెంట్ వాసవినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఓ ఇద్దరు దంపతులు శనివారం సాయంత్రం జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. అయితే వారు పెట్టిన ఆర్డర్ అనుకున్న సమయానికి డెలివరీ కాలేదు. కాస్త ఆలస్యమైంది. మొత్తానికి డెలివరీ బాయ్ రానే వచ్చాడు. అతన్ని చూడగానే దంపతులు ఉడికిపోయారు. కర్ర తీసుకుని డెలివరీ బాయ్‌పై దాడి చేశారు దంపతులు. ఆర్డర్ ఎందుకు ఆలస్యమైందని నిలదీస్తూ కోపంతో ఊగిపోయారు. లొకేషన్ తప్పుగా చూపించడంతోనే ఫుడ్ ఆర్డర్ ఆలస్యమైందని చెప్పినా ఆ దంపతులు వినిపించుకోలేదు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటన శనివారం సాయంత్రం 5:08 గంటలకు చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సీసీటీవీ ఫుటేజ్..!
ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ వాసవినగర్‌లో ఘటన
లొకేషన్ తప్పుగా చూపించడంతో ఫుడ్ ఆర్డర్ లేట్ అయిందని జొమాటో డెలివరీ బాయ్ ఆశిపై దంపతులు దాడి
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు https://t.co/sxvknxSfsI
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2026
సంబంధిత వార్తలు

Bolarum Arms Theft | బొల్లారం మిలిటరీ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్: ముగ్గురు జవాన్లు సహా మరో ఏడుగురు అరెస్ట్.. అసలు స్కెచ్ అదే
అక్టోబర్ 3, 2026

Special Train | ఈ నెల 4, 5 తేదీల్లో సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు..
అక్టోబర్ 3, 2026

Arms Theft Case | మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీలో విస్తుపోయే విషయాలు..!
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి
- ●Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల్లో సూర్య సంచారం.. ఈ మూడురాశుల వారికి శుభ ఫలితాలు!
- ●Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ - రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్
- ●India Nuclear Weapons | శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ అణుబలం: 190 వార్హెడ్లు.. ఏ మూలకైనా దూసుకెళ్లే మిస్సైల్ నెట్వర్క్!
- ●Lucky Restaurant Issue | మా హోటల్‌ను తిరుపతిరెడ్డి లాక్కోవాలని చూస్తున్నడు
- ●Chiranjeevi | పెద్ది డైరెక్టర్‌తో మెగాస్టార్ మూవీ - రా అండర్ రస్టిక్ కథతో ...

Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి

Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల్లో సూర్య సంచారం.. ఈ మూడురాశుల వారికి శుభ ఫలితాలు!

Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ - రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్

India Nuclear Weapons | శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ అణుబలం: 190 వార్హెడ్లు.. ఏ మూలకైనా దూసుకెళ్లే మిస్సైల్ నెట్వర్క్!



