India becomes 4th largest economy | జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. 2030 నాటికి మూడో స్థానమే లక్ష్యం
ప్రస్తుతం అమెరికా ప్రపంచంలోనే మొదటి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. చాలా ఏళ్ల నుంచి అమెరికానే తొలి స్థానంలో కొనసాగుతుండగా.. దాని తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది.
సంక్షిప్త సారాంశం
ఇది భారతదేశం సత్తా. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరో మైలురాయిని చేరుకుంది. టెక్నాలజీ, పలు ఇన్నోవేషన్లతో ప్రపంచాన్ని శాసిస్తున్నాం అని చెప్పుకుంటున్న జపాన్ దేశాన్ని వెనక్కి నెట్టేసింది. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. భారత జీడీపీ విలువ ప్రస్తుతం 4.18 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇలాగే ఈ జోరు కంటిన్యూ అయితే 2030 నాటికి మూడో స్థానంలో ఉన్న జర్మనీని దాటేసి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలవనుంది.
India becomes 4th largest economy | భారత ఆర్థిక వ్యవస్థ మరో మైలురాయిని అధిగమించింది. జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ప్రస్తుతం భారత జీడీపీ (GDP) విలువ 4.18 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఇదే జోరు కొనసాగితే, 2030 నాటికి జర్మనీని సైతం దాటేసి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.
ఆరు త్రైమాసికాల గరిష్ఠ స్థాయి
ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. అయినా కూడా భారత్ మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆర్థిక వృద్ధిని కొనసాగించింది. దానికి ఫలితమే 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత్ రియల్ జీడీపీ 8.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొదటి త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం ఉండగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.4 శాతంగా ఉంది. గత ఆరు త్రైమాసికాలను పొల్చి చూస్తే అత్యధిక వృద్ధి రేటు ఇదే కావడం గమనార్హం. భారత ఆర్థిక వ్యవస్థ ఇంత పటిష్ఠం కావడానికి ప్రభుత్వం చేపడుతున్న వ్యవస్థాగత సంస్కరణలు, దేశీయ వినియోగం ప్రధాన కారణాలని నివేదిక చెబుతోంది.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అత్యంత వేగంగా దూసుకుపోతోందని.. 2047 నాటికి భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యంతోనే తాము ముందుకెళ్తున్నామని.. వ్యవస్థాగత సంస్కరణలు, సామాజిక పురోగతే.. భారత్ ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా నిలిచాయని భారత ప్రభుత్వం ప్రకటించింది.
ధరల నియంత్రణ, తగ్గుతున్న నిరుద్యోగం, పెరుగుతున్న ఎగుమతులే దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తొలి స్థానంలో అమెరికా.. రెండో స్థానంలో చైనా
ప్రస్తుతం అమెరికా ప్రపంచంలోనే మొదటి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. చాలా ఏళ్ల నుంచి అమెరికానే తొలి స్థానంలో కొనసాగుతుండగా.. దాని తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది. జర్మనీ మూడో స్థానంలో కొనసాగుతోంది. నాలుగో స్థానంలో ఉన్న జపాన్‌ని భారత్ వెనక్కి నెట్టింది.
2030 నాటికి భారత్ 7.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగి, జర్మనీని కూడా దాటే ప్రణాళికలను అమలు చేస్తోంది.
సంబంధిత వార్తలు

India Economy | ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు 7.3.. ఐక్యరాజ్యసమితి సంస్థ అంచనా..
అక్టోబర్ 10, 2026

కేంద్రం కొత్త జీడీపీ లెక్కలు.. 7.8% వృద్ధి వెనుక ₹6.05 లక్షల కోట్ల ట్విస్ట్!
సెప్టెంబర్ 5, 2026

Kharge | లైట్స్.. కెమెరా.. ఇన్‌యాక్షన్‌లా ఆర్థిక వ్యవస్థపై ప్రచారం.. ప్రధాని మోదీపై ఖర్గే సెటైర్లు..!
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



