త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kiran Kumar Reddy | అంతర్జాతీయ సదస్సులను రాజకీయ కోణంలో చూడొద్దు: ఎంపీ చామల

Chamala Kiran Kumar Reddy | అంతర్జాతీయ పెట్టుబడులకు, స్థానిక అభివృద్ధికి `భారత్ సమ్మిట్ 2026` వారధిగా నిలుస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు. తెలంగాణ (Telangana) ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో పెంచే ఇలాంటి సదస్సులను రాజకీయ కోణంలో చూడకుండా ప్రతిపక్షాలు సహకరించాలని సూచించారు.

G

Telangana | Published On Nov 13, 2026, 12.34 pm IST

Chamala Kiran Kumar Reddy | అంతర్జాతీయ సదస్సులను రాజకీయ కోణంలో చూడొద్దు: ఎంపీ చామల
Advertisement

Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర న్యూస్‌: అంతర్జాతీయ పెట్టుబడులకు, స్థానిక అభివృద్ధికి `భారత్ సమ్మిట్ 2026` వారధిగా నిలుస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు. తెలంగాణ (Telangana) ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో పెంచే ఇలాంటి సదస్సులను రాజకీయ కోణంలో చూడకుండా ప్రతిపక్షాలు సహకరించాలని సూచించారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ, హైటెక్స్ వేదికగా జరుగుతున్న భార‌త్ స‌మ్మిట్‌లో (Bharat Summit) పాల్గొన్న ఆయన.. ఈ స‌ద‌స్సు ద్వారా భువనగిరి నియోజకవర్గ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 70 దేశాల నుంచి వెయ్యి మందికిపైగా ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సు కార్పొరేట్ పెట్టుబడులకు, సామాన్యుల సంక్షేమానికి మధ్య వారధిగా నిలుస్తుందని పేర్కొన్నారు. వచ్చే నెలలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. శ‌నివారం ఇదే వేదికపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) గిగ్ వర్కర్లు, ఇందిరమ్మ ఇండ్ల‌ (Indiramma Indlu) లబ్ధిదారులతో ముఖాముఖి కానున్నారని వెల్లడించారు.

హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, రీజినల్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న భువనగిరి నియోజకవర్గానికి ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ రంగాల పెట్టుబడులతో మంచి అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. పోచంపల్లి చేనేత ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా కూడా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement