త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC Player of the Month Award | ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా దీప్తి శర్మ..

ICC Player of the Month Award | భారత మహిళా క్రికెట్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ మార్కో జాన్సెన్‌ ఐసీసీ అక్టోబర్‌ నెల ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డులకు ఎంపికయ్యారు. మహిళల విభాగంలో దీప్తి, మెన్స్ విభాగంలో జాన్సెన్‌ ఈ పురస్కారాలను సొంతం చేసుకున్నారు. జింబాబ్వేతో సిరీస్‌లో దీప్తి, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో జాన్సెన్‌ అద్భుత ప్రదర్శన కనబర్చడం ఈ అవార్డులకు కారణమైంది.

P

Sports | Published On Nov 13, 2026, 8.53 pm IST

ICC Player of the Month Award | ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా దీప్తి శర్మ..
Advertisement
  • అక్టోబర్‌ నెల అవార్డులు ప్రకటించిన ఐసీసీ
  • జింబాబ్వేపై ఆల్‌రౌండ్‌ షోతో దీప్తికి పురస్కారం
  • ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయంతో జాన్సెన్‌కు అవార్డు

ICC Player of the Month Award | భారత మహిళా క్రికెట్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ మార్కో జాన్సెన్‌ ఐసీసీ అక్టోబర్‌ నెల ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డులకు ఎంపికయ్యారు. మహిళల విభాగంలో దీప్తి, మెన్స్ విభాగంలో జాన్సెన్‌ ఈ పురస్కారాలను సొంతం చేసుకున్నారు. జింబాబ్వేతో సిరీస్‌లో దీప్తి, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో జాన్సెన్‌ అద్భుత ప్రదర్శన కనబర్చడం ఈ అవార్డులకు కారణమైంది.

జింబాబ్వేపై దీప్తి ఆల్‌రౌండ్‌ షో

జింబాబ్వేతో జరిగిన ఆరు టీ20, వన్డే మ్యాచ్‌ల్లోనూ భారత్‌ విజయం సాధించడంలో దీప్తి కీలక పాత్ర పోషించింది. రెండు ఫార్మాట్లలో కలిపి 155 పరుగులు చేయడంతోపాటు ఏడు వికెట్లు పడగొట్టింది. రాయ్‌పూర్‌లో జరిగిన తొలి టీ20లో భారత్‌ 19 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన క్లిష్ట పరిస్థితుల్లో 49 పరుగులతో జట్టును ఆదుకుంది. టీ20 సిరీస్‌లో రెండు వికెట్లు తీసి భారత్‌ క్లీన్‌స్వీప్‌లో భాగమైంది. వన్డే సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించింది. తొలి వన్డేలో రెండు వికెట్లు తీసిన దీప్తి.. రెండో వన్డేలో శతకంతో చెలరేగడంతోపాటు మూడు వికెట్లు పడగొట్టింది. దీంతో భారత్‌ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ అవార్డు కోసం బంగ్లాదేశ్‌ క్రీడాకారిణి శోభనా మొస్తారీ, ఆస్ట్రేలియా ప్లేయర్‌ అన్నాబెల్‌ సదర్లాండ్‌లతో దీప్తి పోటీపడి విజేతగా నిలిచింది. అవార్డు అందుకోవడంపై దీప్తి ఆనందం వ్యక్తం చేసింది. జింబాబ్వే సిరీస్‌ జట్టంతటికీ ప్రత్యేకమని, రెండో వన్డేలో సాధించిన శతకం తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొంది. ఈ పురస్కారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు అంకితం చేస్తున్నట్లు తెలిపింది.

తొలిసారి జాన్సెన్‌కు ఐసీసీ అవార్డు

పురుషుల విభాగంలో దక్షిణాఫ్రికా 26 ఏళ్ల ఆల్‌రౌండర్‌ మార్కో జాన్సెన్‌ తొలిసారి ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1తో గెలుచుకోవడంలో జాన్సెన్‌ కీలకంగా నిలిచాడు. రెండో టెస్టులో 85 పరుగులు చేయడంతోపాటు ఆరు వికెట్లు తీసి జట్టుకు ఇన్నింగ్స్‌ 31 పరుగుల విజయాన్ని అందించాడు. చివరి టెస్టులోనూ అర్ధశతకంతో రాణించి మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ అవార్డు కోసం పాకిస్తాన్‌ ఆటగాడు అరాఫత్‌ మిన్హాస్‌, వెస్టిండీస్‌ కెప్టెన్‌ షాయ్‌ హోప్‌లతో జాన్సెన్‌ పోటీపడ్డాడు. అవార్డు తనకు ఎంతో ప్రత్యేకమని, ఆస్ట్రేలియాతో సిరీస్‌ కెరీర్‌లోనే గుర్తుండిపోయే సిరీస్‌లలో ఒకటని పేర్కొన్నాడు. సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌పై దక్షిణాఫ్రికా గురి..

ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయంతో దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఏడు టెస్టుల్లో 71.43 శాతం పాయింట్లతో కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించడమే తదుపరి లక్ష్యమని జాన్సెన్‌ తెలిపాడు.

Advertisement
Advertisement