త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hormuz crisis | సంక్షోభంపై ఇరాన్‌తో చ‌ర్చిస్తున్నాం : విదేశాంగ ప్ర‌తినిధి ర‌ణ‌ధీర్ జైస్వాల్‌

Hormuz crisis | ప‌శ్చిమాసియాలో కొన‌సాగుతున్న సంక్షోభంపై ఇరాన్‌తో పాటు ప‌లు దేశాల‌తోనూ చ‌ర్చిస్తున్న‌ట్లు విదేశాంగ శాఖ ప్ర‌తినిధి ర‌ణ‌ధీర్ జైస్వాల్ వెల్ల‌డించారు. హార్ముజ్ జ‌ల‌సంధిలో చిక్కుకుపోయిన భార‌త నౌక‌ల‌ను భ‌ద్రంగా తీసుకురావ‌డానికి ప్రాధాన్యం ఇస్తున్నామ‌న్నారు.

P

National | Published On Mar 17, 2026, 7.13 pm IST

Hormuz crisis | సంక్షోభంపై ఇరాన్‌తో చ‌ర్చిస్తున్నాం : విదేశాంగ ప్ర‌తినిధి ర‌ణ‌ధీర్ జైస్వాల్‌
Advertisement

Hormuz crisis | ప‌శ్చిమాసియాలో కొన‌సాగుతున్న సంక్షోభంపై ఇరాన్‌తో పాటు ప‌లు దేశాల‌తోనూ చ‌ర్చిస్తున్న‌ట్లు విదేశాంగ శాఖ ప్ర‌తినిధి ర‌ణ‌ధీర్ జైస్వాల్ వెల్ల‌డించారు. హార్ముజ్ జ‌ల‌సంధిలో చిక్కుకుపోయిన భార‌త నౌక‌ల‌ను భ‌ద్రంగా తీసుకురావ‌డానికి ప్రాధాన్యం ఇస్తున్నామ‌న్నారు. కొన్ని నౌక‌లు ఇంకా హార్ముజ్ జ‌ల‌సంధి ప్రాంతంలోనే ఉన్నాయ‌ని, వాటిని సుర‌క్షితంగా తిరిగి తీసుకువ‌చ్చేందుకు ఇరాన్‌తో పాటు ఇత‌ర దేశాల‌తోనూ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలిపారు. మాన‌వ‌తా స‌హాయం, వివిధ అంశాల‌పై మాట్లాడుతున్నామ‌న్నారు. ప్ర‌స్తుతం భార‌త్ బ్రిక్స్‌కు అధ్య‌క్ష‌త వహిస్తోంద‌ని, బ్రిక్స్ సభ్య దేశాలు పరస్పర అంగీకారం ఆధారంగా ప‌ని చేస్తాయ‌న్నారు. కొన‌సాగతున్న సంక్షోభంలో అనేక బ్రిక్స్ దేశాలు ఉన్నాయ‌ని, వాటిని స‌మ‌న్వ‌యం చేయ‌డం క‌ష్ట‌మైన ప‌ని అని, అయిన‌ప్ప‌టికీ అన్ని ప‌క్షాల‌తో నిరంత‌రం సంప్ర‌దింపులు కొన‌సాగిస్తామ‌న్నారు.

యూరోపియ‌న్ యూనిన్ ఫోరైన్ అఫైర్ కౌన్సిల్ స‌మావేశానికి విదేశాంగ మంత్రి జైశంక‌ర్ హాజ‌ర‌య్యారు. ఈయూ ప్ర‌తినిధి కాజా క‌ల్లాస్ ఆయ‌న‌ను ఆహ్వానించారు. ఈ స‌మావేశంలో భార‌త్‌-ఈయూ సంబంధాలు, వెస్ట్ ఆసియా సంక్షోభం, ఉర్జా భ‌ద్ర‌త‌పై ప్ర‌భావం త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిగాయ‌న్నారు. చ‌ర్చ‌లు, దౌత్యం ద్వారా ప్ర‌స్తుత సంక్షోభాన్ని త్వ‌ర‌గా ముగించాల‌ని మంత్రి ఒత్తిడి తీసుకువ‌చ్చార‌ని జైస్వాల్ తెలిపారు. ఒమ‌న్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌లో మృతి చెందిన ఇద్ద‌రు భార‌తీయుల మృత‌దేహాల‌ను మంగ‌ళ‌వారం బాధిత కుటుంబాల‌కు అప్ప‌గించామ‌ని, ఈ సంద‌ర్భంగా కుటుంబానికి సంతాపం ప్ర‌క‌టిస్తున్నామ‌న్నారు.

గాయ‌ప‌డ్డ వారి ప‌రిస్థితిని ఎంబ‌సీ ప‌ర్య‌వేక్షిస్తోంద‌న్నారు. ఇరాక్ తీరంలో ఉన్న సేఫ్‌సీ విష్ణు నౌక‌పై ఇటీవ‌ల ఇరాన్ దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఈ ట్యాంక‌ర్‌లో 15 మంది భార‌త‌నావికులు ఉన్నారు. వారంతా సుర‌క్షితంగా ఉన్నార‌ని, బాస్రా హోట‌ల్‌లో ఉన్నార‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు చ‌నిపోగా.. మృత‌దేహాన్ని భార‌త్‌కు తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు. ప‌లు ఘ‌ట‌న‌ల్లో ఐదుగురు మృతి చెందార‌ని, ఒక‌రు గ‌ల్లంత‌య్యార‌న్నారు. ఇద్ద‌రి మృత‌దేహాల‌ను తీసుకువ‌చ్చామ‌ని, మిగ‌తా ముగ్గురి మృత‌దేహాల‌ను స్వ‌దేశానికి ఎంబ‌సీల‌తో సంప్ర‌దింపులు కొనసాగిస్తున్న‌ట్లు వివ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement