IPO | ఈ వారంలో 11 ఐపీవోలు.. రూ.7వేల కోట్లకు ఇష్యూలు..
IPO | ఆగస్టులో ప్రైమరీ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో ఐపీఓల సందడి నెలకొంది. మొత్తం 18 మెయిన్‌బోర్డ్, 22 ఎస్‌ఎంఈ ఐపీవోల ద్వారా కంపెనీలు ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించాయి. టెంప్‌సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ (ఇండియా), ధూత్ ట్రాన్స్‌మిషన్, మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్, ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ వంటి కంపెనీలు తమ ఇష్యూ ధరలతో పోలిస్తే 70 శాతం నుంచి 90 శాతం వరకు రాబడులను అందించడంతోపాటు బలమైన సబ్‌స్క్రిప్షన్‌ను నమోదు చేశాయి.
IPO | ఆగస్టులో ప్రైమరీ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో ఐపీఓల సందడి నెలకొంది. మొత్తం 18 మెయిన్‌బోర్డ్, 22 ఎస్‌ఎంఈ ఐపీవోల ద్వారా కంపెనీలు ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించాయి. టెంప్‌సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ (ఇండియా), ధూత్ ట్రాన్స్‌మిషన్, మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్, ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ వంటి కంపెనీలు తమ ఇష్యూ ధరలతో పోలిస్తే 70 శాతం నుంచి 90 శాతం వరకు రాబడులను అందించడంతోపాటు బలమైన సబ్‌స్క్రిప్షన్‌ను నమోదు చేశాయి. ఆగస్టులో నమోదైన రికార్డు స్థాయి ఐపీవోల ప్రవాహం తర్వాత సెప్టెంబర్‌లోనూ ప్రైమరీ మార్కెట్‌లో ఇదే జోరు కొనసాగనుంది. సెప్టెంబర్‌లో 11 మెయిన్‌బోర్డ్ ఐపీవోలతో పాటు పలు ఎస్‌ఎంఈ ఐపీవోలు సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 9న ఒకే రోజు ఆరు మెయిన్‌బోర్డ్, రెండు ఎస్‌ఎంఈ ఐపీవోలు ప్రారంభం కానుండడంతో ఇన్వెస్టర్లకు భారీ అవకాశాలు కనిపిస్తున్నాయి.
సెప్టెంబర్ 7 నుంచి 11 మధ్య..
వచ్చే వారం అంటే సెప్టెంబర్ 7 నుంచి 11 మధ్య సబ్‌స్క్రిప్షన్‌కు రానున్న ఐపీవోలు విభిన్న రంగాలకు చెందినవిగా ఉన్నాయి. స్పెషాలిటీ కెమికల్స్, రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ గ్యాసెస్, ఫిన్‌టెక్, ఆన్‌లైన్ రెంటల్, ఎలక్ట్రికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాలకు చెందిన కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 11 మెయిన్‌బోర్డ్ ఐపీవోల ద్వారా సుమారు రూ.7,055 కోట్లను రిటైల్, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్ ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. ఈ ఇష్యూ పరిమాణం రూ.351 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు గ్లాస్ వాల్ సిస్టమ్స్ (ఇండియా) రూ.428 కోట్ల ఇష్యూ, ప్రసోల్ కెమికల్స్ రూ.500 కోట్ల ఇష్యూ, కనోహర్ ఎలక్ట్రికల్స్ రూ.1,056 కోట్ల ఇష్యూతో మార్కెట్‌లోకి రానున్నాయి.
సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు..
సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్ రూ.805 కోట్ల ఇష్యూతో, అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ రూ.733 కోట్ల ఇష్యూతో, రెంటోమోజో రూ.1,256 కోట్ల ఇష్యూతో, ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్ రూ.427.1 కోట్ల ఇష్యూతో, కరమ్‌తారా ఇంజినీరింగ్ రూ.875 కోట్ల ఇష్యూతో, స్టీమ్‌హౌస్ ఇండియా రూ.414 కోట్ల ఇష్యూతో సబ్‌స్క్రిప్షన్‌కు తెరతీయనున్నాయి. సెప్టెంబర్ 10 నుంచి 15 వరకు వీగాలాండ్ డెవలపర్స్ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ కొనసాగనుంది. ఈ కంపెనీ ఇష్యూ పరిమాణం రూ.210 కోట్లుగా ఉంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఐపీవో కూడా ఈ నెలలోనే వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా సుమారు రూ.30వేల కోట్లను సమీకరించే అవకాశం ఉన్నప్పటికీ, తుది ఐపీవో తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఈ ఐపీవోలలో రెంటోమోజో అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది. సుమారు రూ.1,256 కోట్ల ఇష్యూ పరిమాణంతో రాబోతున్న ఈ ఆన్‌లైన్ రెంటల్ కంపెనీ తర్వాత రూ.1,056 కోట్ల ఇష్యూ పరిమాణంతో కనోహర్ ఎలక్ట్రికల్స్, రూ.875 కోట్లతో కరమ్‌తారా ఇంజినీరింగ్ ఉన్నాయి.
9 ఐపీవోలు రెండు తేదీల్లోనే..
సెప్టెంబర్ ఐపీవో క్యాలెండర్‌లో ముఖ్యంగా వారం మధ్యలో భారీ రద్దీ కనిపించనుంది. 11 ఐపీవోల్లో ఏకంగా తొమ్మిది ఐపీఓలు సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ప్రారంభం కానున్నాయి. దీంతో ఆ రెండు రోజులు ప్రైమరీ మార్కెట్‌కు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈసారి ఐపీవోల జాబితాలో తయారీ, పారిశ్రామిక రంగాలకు చెందిన కంపెనీల ఆధిపత్యం కనిపిస్తోంది. కనోహర్ ఎలక్ట్రికల్స్, ప్రసోల్ కెమికల్స్, కరమ్‌తారా ఇంజినీరింగ్, గ్లాస్ వాల్ సిస్టమ్స్, ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్ వంటి సంస్థలు ఎలక్ట్రికల్ పరికరాలు, కెమికల్స్, ఇంజినీరింగ్, బిల్డింగ్ సొల్యూషన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే సెప్టెంబర్ ఐపీవో మార్కెట్ కేవలం సంప్రదాయ తయారీ రంగానికే పరిమితం కాలేదు. మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్ ద్వారా ఫిన్‌టెక్, పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగం, అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ ద్వారా ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం, రెంటోమోజో ద్వారా ఆన్‌లైన్ రెంటల్ రంగం కూడా ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి.
తాజావార్తలు
- ●Uniforms | డెంగీ భయం.. బాలికలు స్కర్ట్స్ ధరించొద్దన్న మంత్రి
- ●AstraZeneca | ఆస్ట్రాజెనెకా భారీ విజయం.. కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి..
- ●Ramchandar Rao | అవినీతిని న్యాయబద్ధం చేయడానికే 22ఏ జాబితా
- ●Asaduddin Owaisi | రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఇక ముస్లింలకు వర్తించదా..? మసీదు కూల్చివేతపై ఒవైసీ ఆగ్రహం
- ●World Map | మారనున్న ప్రపంచ పటం!
- ●KTR Karimnagar Speech | ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయితదో ఆయనే కేసీఆర్

Uniforms | డెంగీ భయం.. బాలికలు స్కర్ట్స్ ధరించొద్దన్న మంత్రి

AstraZeneca | ఆస్ట్రాజెనెకా భారీ విజయం.. కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి..

Ramchandar Rao | అవినీతిని న్యాయబద్ధం చేయడానికే 22ఏ జాబితా

Asaduddin Owaisi | రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఇక ముస్లింలకు వర్తించదా..? మసీదు కూల్చివేతపై ఒవైసీ ఆగ్రహం






