త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | 17 జిల్లాల్లో లోటు వర్షపాతం: రెవెన్యూ మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy | ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో 17 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం శాసనసభలో ఎల్‌నినోపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడారు.

S

Telangana | Published On Sep 18, 2026, 7.03 pm IST

Ponguleti Srinivas Reddy | 17 జిల్లాల్లో లోటు వర్షపాతం: రెవెన్యూ మంత్రి పొంగులేటి
Advertisement

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్ : ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో 17 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం శాసనసభలో ఎల్‌నినోపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడారు. ఈ నెల 10వ తేదీ వరకు నమోదైన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరిలో 21 శాతం, హైదరాబాద్‌లో 22 శాతం, మెదక్‌లో 23 శాతం, వికారాబాద్‌లో 26 శాతం, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 28 శాతం, జనగామలో 30 శాతం, ఆదిలాబాద్‌లో 31 శాతం, మహబూబ్‌నగర్‌లో 32 శాతం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండలో 33 శాతం, సూర్యాపేటలో 34 శాతం, వరంగల్‌, ఖమ్మంలో 37 శాతం, నారాయణపేటలో 38 శాతం, నాగర్‌కర్నూల్‌లో 39 శాతం, వనపర్తిలో 41 శాతం, హనుమకొండలో 42 శాతం, జోగులాంబ గద్వాలలో 46 శాతం వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని వివరించారు. కొన్ని మండ‌లాల్లో ఒకేసారి క్లౌడ్ బ‌రెస్ట్ జ‌రిగిన‌ట్లు ఒక‌ నెల‌లో ప‌డాల్సిన వ‌ర్షం ఒక గంట‌లో కురిస్తే రికార్డుల‌లో వ‌ర్ష‌పాతం న‌మోదైనా వాస్త‌వానికి ఆనీరు ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డ‌ద‌ని వివ‌రించారు.

33 లక్షల పంప్‌సెట్లకు నిరంతర విద్యుత్‌

వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లపై ఆధారపడుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 33 లక్షల పంప్‌సెట్లు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. దీంతో విద్యుత్‌ వినియోగం అనూహ్యంగా పెరిగిందన్నారు. సెప్టెంబర్‌ 9న రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌ సుమారు 19,575 మెగావాట్లకు చేరిందని వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావం కేవలం వ్యవసాయం, తాగునీటికే పరిమితం కాదని, పశుసంపదపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని మంత్రి అన్నారు. పశువులకు మేత, నీటి లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని కేబినెట్‌లోనే పశుసంవర్ధక, వ్యవసాయ శాఖలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.

Advertisement
Advertisement