TG Weather | తెలంగాణలో ఈ నెల 24 వరకు భారీ వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!
TG Weather | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ తీపికబురు చెప్పింది. ఈ నెల 24 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది.
TG Weather | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ తీపికబురు చెప్పింది. ఈ నెల 24 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. శనివారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు భారీ వర్షాలు పడే సూచనలున్నాయని అంచనా వేసింది. సోమవారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
మంగళవారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే, బుధ, గురువారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా మెదక్ జిల్లా కుల్చారం గ్రామంలో 12.9 సెంటీమీటర్ల భారీ వర్షాపాతం నమోదైంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Direct Tax Collections | కేంద్రానికి రూ.12.12 లక్షల కోట్ల ఆదాయం.. పన్ను వసూళ్లలో రికార్డు వృద్ధి..
- ●Congress MPs | హరీశ్‌రావు మామ భూమిని పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీల బృందం
- ●Ponnam Prabhakar | ఎల్‌నినో రాజకీయ సమస్య కాదు.. బీజేపోళ్లు కేంద్రం నుంచి నిధులు తేవాలి
- ●OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు ఇవే - రవితేజ బ్లాక్‌బస్టర్‌తో పాటు ఈ మలయాళం థ్రిల్లర్‌ను మిస్సవ్వొద్దు
- ●Kunamneni Sambashiva Rao | ఎండిపోయిన పంటలకు పెట్టుబడి ఇవ్వాలి
- ●Dengue Vaccine | భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్.. వచ్చే ఏడాదే అందుబాటులోకి..

Direct Tax Collections | కేంద్రానికి రూ.12.12 లక్షల కోట్ల ఆదాయం.. పన్ను వసూళ్లలో రికార్డు వృద్ధి..

Congress MPs | హరీశ్‌రావు మామ భూమిని పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీల బృందం

Ponnam Prabhakar | ఎల్‌నినో రాజకీయ సమస్య కాదు.. బీజేపోళ్లు కేంద్రం నుంచి నిధులు తేవాలి

OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు ఇవే - రవితేజ బ్లాక్‌బస్టర్‌తో పాటు ఈ మలయాళం థ్రిల్లర్‌ను మిస్సవ్వొద్దు




