Kaushik Reddy | దానం నాగేందర్‌పై అనర్హత వేటు ప్రజాస్వామ్య విజయం: కౌశిక్‌రెడ్డి
Kaushik Reddy | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యం సాధించిన విజయమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పుపై శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు తమ పార్టీ రెండున్నరేళ్లుగా చేస్తున్న పోరాటానికి దక్కిన విజయమని పేర్కొన్నారు.
Kaushik Reddy | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యం సాధించిన విజయమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పుపై శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు తమ పార్టీ రెండున్నరేళ్లుగా చేస్తున్న పోరాటానికి దక్కిన విజయమని పేర్కొన్నారు. ‘హై కోర్టు ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యం సాధించిన విజయం. సీఎం రేవంత్ కు చెంపపెట్టు’ అని వ్యాఖ్యానించారు. హైకోర్టుకు బీఆర్‌ఎస్ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ‘ఇది బీ ఆర్ ఎస్ విజయం. రెండున్నరేళ్లు గా చేస్తున్న మా పార్టీకి విజయం దక్కింది’ అన్నారు. ప్రజలను ఎల్లకాలం మోసం చేయవచ్చని రేవంత్ అనుకున్నారని, అయితే రేవంత్‌కు కోర్టు బ్రేక్ వేసిందని వ్యాఖ్యానించారు.
దానం నాగేందర్ మాదిరిగానే పార్టీ మారిన మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు పడటం ఖాయమని కౌశిక్‌రెడ్డి అన్నారు. ‘మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయి’ అని చెప్పారు. ఏ పార్టీ యే చెప్పుకోలేని పరిస్థితి ఫిరాయింపు ఎమ్మెల్యేలదని, ‘అమ్మ నాన్న ఎవరో చెప్పుకోలేని పరిస్థితి ఫిరాయింపు ఎమ్మెల్యేలది’ అని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన కడియం శ్రీహరి వ్యవహారంపైనా ఆయన స్పందించారు. ‘పార్టీ మారిన కడియం శ్రీహరిది అనైతికమా నాది అనైతికమా ఎథిక్స్ కమిటీ తేల్చాలి’ అన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ ఘనవిజయం ఖాయమని కౌశిక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘ఖైరతాబాద్ ఓటర్లు రేవంత్ మోసాలకు తీర్పునిస్తారు’ అని స్పష్టం చేశారు. దానం నాగేందర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ‘దానం నాగేందర్ ఫైటర్ కాదు చీటర్’ అంటూ హండిపడ్డారు. ‘దానంకు పట్టిన గతే మిగతా ఎనిమిది మందికి పడుతుంది’ అని కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Minister Seethakka | తాగునీరు, ఉపాధికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు
- ●Oscars 2027 | ఇండియా నుంచి ఆస్కార్ బరిలో మరాఠీ థ్రిల్లర్ మూవీ - టాలీవుడ్‌కు నిరాశ
- ●Ponguleti Srinivas Reddy | సిద్దిపేటలో ఆక్రమించుకున్న భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తాం
- ●iPhone 18 Pro | క్యూలో నిలబడాల్సిన పనిలేదు.. 10 నిమిషాల్లో ఐఫోన్ 18 ఫోన్లు డెలివరీ..
- ●Danam Nagender | దానం నాగేందర్‌కు షాక్.. అనర్హత వేటు వేసిన హైకోర్టు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. సూచీల్లో మిశ్రమ స్పందన..

Minister Seethakka | తాగునీరు, ఉపాధికి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు

Oscars 2027 | ఇండియా నుంచి ఆస్కార్ బరిలో మరాఠీ థ్రిల్లర్ మూవీ - టాలీవుడ్‌కు నిరాశ

Ponguleti Srinivas Reddy | సిద్దిపేటలో ఆక్రమించుకున్న భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తాం

iPhone 18 Pro | క్యూలో నిలబడాల్సిన పనిలేదు.. 10 నిమిషాల్లో ఐఫోన్ 18 ఫోన్లు డెలివరీ..




