త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | మెట్రో రెండో ద‌శ‌కు అభ్యంతరం లేదు.. 50:50 ప్రాతిప‌దిక‌న ముందుకెళ్లేందుకు కేంద్రం సిద్ధం: కిషన్‌రెడ్డి

Kishan Reddy | హైద‌రాబాద్ మెట్రో (Hyderabad Metro) రెండో ద‌శ విస్త‌ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Kishan Reddy0 అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు 50ః50 ఖ‌ర్చుచేసే ప్రాతిప‌తిక‌న ముందుకు వెళ్లేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని చెప్పారు.

G

Telangana | Published On May 20, 2026, 12.19 pm IST

Kishan Reddy | మెట్రో రెండో ద‌శ‌కు అభ్యంతరం లేదు.. 50:50 ప్రాతిప‌దిక‌న ముందుకెళ్లేందుకు కేంద్రం సిద్ధం: కిషన్‌రెడ్డి
Advertisement

Kishan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్ మెట్రో (Hyderabad Metro) రెండో ద‌శ విస్త‌ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Kishan Reddy0 అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు 50ః50 ఖ‌ర్చుచేసే ప్రాతిప‌తిక‌న ముందుకు వెళ్లేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల‌పై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో (Manohar Lal Khattar) కిషన్‌రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క ప్రాజెక్టుల‌పై చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా.. మూసీనదిలో కలుస్తున్న మురుగు నీటిని శుద్ధి చేసేందుకు మొత్తం 39 సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింద‌న్నారు. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.3,975 కోట్లని చెప్పారు. ఈమేర‌కు ఆయ‌న ఓ ప్రకటన విడుద‌ల చేశారు.

‘నగరంలో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ప్రజారవాణాపై చర్చించాం. హైదరాబాద్‌ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించిన‌ డీపీఆర్‌ అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఖట్టర్‌ చెప్పారు. మెట్రో రెండో ద‌శ‌క ప్రాజెక్టు విస్త‌ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కేంద్ర, రాష్ట్రాలు చెరో సగం ఖర్చుతో ముందుకెళ్లేందుకు సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండోదశ విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించిందని, దానిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుందని ఖట్టర్‌ చెప్పారు. ఇక 39 ఎస్‌టీపీల ద్వారా రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉందన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని ఖట్టర్ స్పష్టం చేశారు. వారికి హైదరాబాద్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశా’ అని కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు.

Advertisement
Advertisement