West Bengal | అభిషేక్ బెనర్జీకి ‘జెడ్ ప్లస్’ భద్రత వెనక్కి.. సువేందు ప్రభుత్వం కీలక నిర్ణయం..!
West Bengal | బెంగాల్‌లో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం టీఎంసీ జాఈయ ప్రధాన కార్యదర్శి, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి కల్పించిన జెడ్ ప్లస్ సెక్యూరిటీని ఉపసంహరించుకుంది. అభిషేక్ బెనర్జీకి ఇప్పటివరకు ఉన్న అదనపు భద్రతా సిబ్బంది, ప్రత్యేక పైలట్ కార్ సౌకర్యాన్ని ఇకపై కొనసాగించొద్దని సువేందుకు సర్కారు నిర్ణయించినట్లుగా సమాచారం.
West Bengal | బెంగాల్‌లో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం టీఎంసీ జాఈయ ప్రధాన కార్యదర్శి, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి కల్పించిన జెడ్ ప్లస్ సెక్యూరిటీని ఉపసంహరించుకుంది. అభిషేక్ బెనర్జీకి ఇప్పటివరకు ఉన్న అదనపు భద్రతా సిబ్బంది, ప్రత్యేక పైలట్ కార్ సౌకర్యాన్ని ఇకపై కొనసాగించొద్దని సువేందుకు సర్కారు నిర్ణయించినట్లుగా సమాచారం. గత పదేళ్లకుపైగా అభిషేక్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతోంది, అయితే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత భద్రతను దశలవారీగా తగ్గిస్తూ వచ్చారు. తాజాగా పూర్తిగా ఉపసంహరించుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా నబన్నా (సీఎంవో) వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయని, సీఎం సువేందు అధికారి తొలిసారిగా పలు సమీక్షలు నిర్వహించారన్నారు. కలెక్టర్లు, సీనియర్ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. భేటీలో రాజకీయ నేతల భద్రతా ఏర్పాట్లపై చర్చ జరిగినట్లు సమాచారం. అవసరం లేని భద్రతా ఏర్పాట్లకు ప్రభుత్వ ధనం ఖర్చు చేయకూడదని, నిజంగా ముప్పు ఉన్నప్పుడు మాత్రమే అదనపు భద్రత ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అభిషేక్ బెనర్జీ సెక్యూరిటీని తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సాధారణ ఎంపీ తరహాలోనే..
ఇకపై ఆయనకు సాధారణ ఎంపీకి కల్పించే భద్రత మాత్రమే కొనసాగనుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం భద్రతా ఏర్పాట్లను సమీక్షించి దశలవారీగా అదనపు బలగాలను తొలగించనున్నట్లు అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచే ఆయన భద్రతను తగ్గించే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు అభిషేక్ బెనర్జీ కార్యాలయం ఉన్న కామాక్ స్ట్రీట్ ప్రాంతం భారీ పోలీసు భద్రతతో ఉండేది. ప్రభుత్వం మారిన తర్వాత అక్కడి పోలీసు గార్డులను తొలగించారు. హరీస్ ముఖర్జీ రోడ్డులోని ఆయన నివాసం వద్ద భద్రత కూడా తగ్గించారు. ‘శాంతినికేతన్’ నివాసంలో ఏర్పాటు చేసిన భద్రతా పరికరాలు, మౌలిక వసతులను కూడా తొలగించినట్లు సమాచారం. అలాగే, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం వద్ద భద్రతను తగ్గించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె నివాసానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను 24 గంటల్లోనే తొలగించారు. అనంతరం అదనపు పోలీసు సిబ్బందిని కూడా ఉపసంహరించినట్లు వెల్లడించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






