త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IBPS | 6715 పోస్టుల‌తో IBPS ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్స్ నోటిఫికేష‌న్‌..

IBPS | బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉద్యోగం చేయాల‌ని ఉందా.. ఇంకేందుకు ఆల‌స్యం. మీకోసం ఇప్ప‌టికే ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల కోసం నోటిఫికేష‌న్లు విడుద‌ల చేశాయి. తాజాగా ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సోన‌ల్ సెలెక్ష‌న్ (IBPS) 11 ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీల భ‌ర్తీకి (IBPS Recruitment) రంగం సిద్ధం చేసింది.

G

National | Published On Jul 2, 2026, 7.49 am IST

IBPS | 6715 పోస్టుల‌తో IBPS ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్స్ నోటిఫికేష‌న్‌..
Advertisement

IBPS | త్రినేత్ర‌.న్యూస్‌: బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉద్యోగం చేయాల‌ని ఉందా.. ఇంకేందుకు ఆల‌స్యం. మీకోసం ఇప్ప‌టికే ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల కోసం నోటిఫికేష‌న్లు విడుద‌ల చేశాయి. తాజాగా ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సోన‌ల్ సెలెక్ష‌న్ (IBPS) 11 ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీల భ‌ర్తీకి (IBPS Recruitment) రంగం సిద్ధం చేసింది. క‌ష్ట‌ప‌డి చ‌ద‌వండి. ఉద్యోగం సంపాదించండి!.

6715 ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ (Probationary Officer) లేదా మేనేజ్‌మెంట్ ట్రెయినీ (management trainee) పోస్టుల‌తో ఐబీపీసీఎస్ నోటిఫికేస‌న్ విడుద‌ల చేసింది. అర్హులైన‌వారు ఆన్‌లైన్‌లో జూలై 21 వ‌రకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. ఎంపికైన‌వారికి ప్ర‌తినెల రూ.74,000 నుంచి రూ.76,000 వ‌ర‌కు జీతం అందుకోవ‌చ్చు.

మొత్తం ఖాళీలు: 6715

  • బ్యాంక్ ఆఫ్ బ‌రోడా- 1900 (ఎస్సీ 285, ఎస్టీ 142, ఓబీసీ 513, ఈడ‌బ్ల్యూఎస్ 190, జ‌న‌ర‌ల్ 770)
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా- 500 (ఎస్సీ 75, ఎస్టీ 37, ఓబీసీ 513, ఈడ‌బ్ల్యూఎస్ 135, జ‌న‌ర‌ల్ 203)
  • బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర‌- 1100 (ఎస్సీ 165, ఎస్టీ 82, ఓబీసీ 297, ఈడ‌బ్ల్యూఎస్ 110, జ‌న‌ర‌ల్ 446)
  • సెంట్ర‌ల్ బ్యాంక్‌- 1500 (ఎస్సీ 225, ఎస్టీ 112, ఓబీసీ 405, ఈడ‌బ్ల్యూఎస్ 150, జ‌న‌ర‌ల్ 608)
  • సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 500 (ఎస్సీ 75, ఎస్టీ 37, ఓబీసీ 135, ఈడ‌బ్ల్యూఎస్ 50, జ‌న‌ర‌ల్ 203)
  • ఇండియ‌న్ ఓవ‌ర్‌సీస్‌ బ్యాంక్‌- 550 (ఎస్సీ 84, ఎస్టీ 41, ఓబీసీ 148, ఈడ‌బ్ల్యూఎస్ 54, జ‌న‌ర‌ల్ 223)
  • పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌- 504 (ఎస్సీ 76, ఎస్టీ 38, ఓబీసీ 136, ఈడ‌బ్ల్యూఎస్ 50, జ‌న‌ర‌ల్ 204)
  • పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌- 504 (ఎస్సీ 24, ఎస్టీ 13, ఓబీసీ 47, ఈడ‌బ్ల్యూఎస్ 15, జ‌న‌ర‌ల్ 62)
  • యూకో బ్యాంక్‌, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియ‌న్ బ్యాంక్‌లో ఖాళీల‌పై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

అర్హ‌త‌: అభ్య‌ర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూట‌ర్‌పై అవ‌గాహ‌న‌, భాష‌పై ప‌ట్టు త‌ప్ప‌నిస‌రి. అభ్య‌ర్థులు 20 నుంచి 30 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగి ఉండాలి. లేదా 1996 జూలై 2 నుంచి 2006 జూలై 1 మ‌ధ్య జ‌న్మించిన‌వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, పీడ‌బ్ల్యూడీ, ఎక్స్‌స‌ర్వీస్ మెన్‌కు వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక విధానం

మూడు ద‌శ‌ల్లో ఉంటుంది. మొద‌ట ప్రిలిమ్స్‌, అందులో అర్హ‌త సాధించిన వారికి మెయిన్స్‌. అనంత‌రం ఇంట‌ర్వ్యూ ఉంటుంది.
ప్రిలిమ్స్‌: మొత్తం 100 ప్ర‌శ్న‌లు, వంద మార్కుల‌కు అడుగుతారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 (30 మార్కులు), న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ 35 (30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ 35 (40 మార్కులు) ప్ర‌శ్న‌లు అడుగుతారు. ప్ర‌తి సెక్ష‌న్‌కు 20 నిమిషాల చొప్పున 60 నిమిషాల్లో ప‌రీక్ష పూర్తి చేయాలి. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. సెక్ష‌న‌ల్ క‌టాఫ్ ఉంటుంది. అర్హులైన వారిని మెయిన్స్‌కు ఆహ్వానిస్తారు.

మెయిన్స్‌: మొత్తం 170 ప్ర‌శ్న‌లు అడుగుతారు. 200 మార్కులు ఉంటాయి. రీజ‌నింగ్ 40 (60 మార్కులు-45 నిమిషాలు), జ‌న‌ర‌ల్, ఎకాన‌మీ, బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి 50 ప్ర‌శ్న‌లు (60 మార్కులు- 35 నిమిషాలు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్ర‌శ్న‌లు (20 మార్కులు- 35 నిమిషాలు), డాటా అనాలిసిస్ అండ్ ఇంట‌ర్‌ప్రిటేష‌న్ 40 (60 మార్కులు- 45 నిమిషాలు), డిక్క్రిప్టివ్ పేప‌ర్ (ఎస్సే అండ్ కాంప్ర‌హెన్ష‌న్‌) 2 ప్ర‌శ్న‌లు (25 మార్కులు-30 నిమిషాలు). మొత్తం 160 నిమిషాల్లో ప‌రీక్ష పూర్తి చేయాలి. ప్ర‌తి త‌ప్పు జ‌వాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు. ఇందులో అర్హ‌త సాధించిన వారిని ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు.

ఇంట‌ర్వ్యూ: మొత్తం 100 మార్కుల‌కు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ల‌కు చివ‌రితేదీ: జూలై 21
అప్లికేష‌న్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు రూ.175
ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్‌: ఆగ‌స్టులో
ప్రిలిమ్స్‌: ఆగ‌స్టు 22, 23 తేదీల్లో
ప్రిలిమ్స్ ఫ‌లితాలు: సెప్టెంబ‌ర్‌లో
మెయిన్స్ ఎగ్జామ్‌: అక్టోబ‌ర్ 4న‌
ఫ‌లితాలు: న‌వంబ‌ర్‌లో
ప‌ర్స‌నాలిటీ టెస్ట్‌: న‌వంబ‌ర్‌లో
ఇంట‌ర్వ్యూ: న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్‌
తుది ఫ‌లితాలు: 2027 జ‌న‌వ‌రిలో
వెబ్‌సైట్‌: www.ibps.in

Advertisement
Advertisement