IBPS RRB | ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్.. గ్రామీణ బ్యాంకుల్లో 13,706 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
IBPS RRB | బ్యాంకుల్లో ఉద్యోగాలు సాధించాలనుకునే వారికి ఐబీపీఎస్ శుభవార్త అందించింది. గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRB) కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్- ఆర్‌ఆర్‌బీ (CRP RRBs XV) ద్వారా 13,706 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (IBPS RRB) విడుదల చేసింది.
IBPS RRB | త్రినేత్ర.న్యూస్: బ్యాంకుల్లో ఉద్యోగాలు సాధించాలనుకునే వారికి ఐబీపీఎస్ శుభవార్త అందించింది. గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRB) కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్- ఆర్‌ఆర్‌బీ (CRP RRBs XV) ద్వారా 13,706 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (IBPS RRB) విడుదల చేసింది. ఇందులో గ్రూప్-ఏ ఆఫీసర్లు (స్కేల్-I, II, III), గ్రూప్ బీ- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టులు ఉన్నాయి. మల్టీపర్పస్ 8,183 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ 4,256, స్కేల్-2 ఆఫీసర్ 1047, సీనియర్ మేనేజర్ 220 చొప్పున ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోచ్చు. సెప్టెంబర్ 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 13,706
- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 8,183
- ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్): 4,256
- ఆఫీసర్ స్కేల్-II- (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): 666
- ఆఫీసర్ స్కేల్-II (ఐటీ): 182
- ఆఫీసర్ స్కేల్-II (చార్టర్డ్ అకౌంటెంట్): 81
- ఆఫీసర్ స్కేల్-II (లా): 46
- ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ మేనేజర్): 18
- ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్): 16
- ఆఫీసర్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్): 38
- ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్): 220
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) మినహా ఇతర పోస్టులకు ఉద్యోగానుభవం తప్పనిసరి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 18 నుంచి 30 ఏండ్లు, ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) 21 నుంచి 32 ఏండ్లు, ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) 21 నుంచి 40 ఏండ్లు, ఆఫీస్ అసిస్టెంట్లకు (మల్టీపర్పస్) 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.
ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. వీరికి ఇంటర్వ్యూ ఉండదు. ఆఫీసర్ స్కేల్-I పోస్టుకు ప్రిలిమ్స్, మెయిన్స్‌తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్-II, III పోస్టులకు సింగిల్ లెవెల్ ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇక అన్ని ఆబ్జెక్టివ్ పరీక్షల్లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోతవిధిస్తారు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 21
ప్రీ-ఎగ్జామ్: నవంబర్ నెలలో
ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: నవంబర్ లేదా డిసెంబర్
ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్ లేదా డిసెంబర్
ఫలితాలు: 2026 డిసెంబర్ లేదా 2027 జనవరి
ఆన్‌లైన్ మెయిన్స్ లేదా సింగిల్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2026 డిసెంబర్ లేదా 2027 జనవరి
పరీక్ష తేదీ: 2027 జనవరి
ఫలితాల వెల్లడి (ఆఫీసర్ స్కేల్ 1, 2, 3): 2027 జనవరి
ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2027 జనవరి
ఇంటర్వ్యూ: 2027 జనవరి లేదా ఫిబ్రవరి
ప్రొవిజనల్ అలాట్‌మెంట్: 2027 ఫిబ్రవరి లేదా మార్చి
వెబ్‌సైట్: www.ibps.in
సంబంధిత వార్తలు

NIC Recruitment | నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో టెక్నికల్ అసిస్టెంట్లు..
సెప్టెంబర్ 4, 2026

SSC JE Recruitment | కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. 1748 పోస్టులతో SSC JE నోటిఫికేషన్
సెప్టెంబర్ 3, 2026

CPCB Recruitment | పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండా ఎంపిక
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



