త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణ‌లో ఈ నెల 27 దాకా అతిభారీ వ‌ర్షాలు..

TG Weather | తెలంగాణ‌లో ఈ నెల 27 వ‌ర‌కు భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప‌పీడ‌నం ప్ర‌భావంతో వాన‌లు ప‌డుతున్న‌ట్లు తెలిపింది.

P

Telangana | Published On Sep 21, 2026, 6.25 pm IST

TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణ‌లో ఈ నెల 27 దాకా అతిభారీ వ‌ర్షాలు..
Advertisement

TG Weather | తెలంగాణ‌లో ఈ నెల 27 వ‌ర‌కు భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప‌పీడ‌నం ప్ర‌భావంతో వాన‌లు ప‌డుతున్న‌ట్లు తెలిపింది. సోమ‌వారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని వెల్ల‌డించింది. అలాగే, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గాం, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంట‌కు 40-50 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వాన‌లు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని తెలిపింది. అలాగే, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, వికారాబాద్‌, మెద‌క్‌, కామారెడ్డి, మెద‌క్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వాన‌లు ప‌డుతాయ‌ని హెచ్చ‌రించింది.

ఆరెంజ్ అలెర్ట్ జారీ..

మంగ‌ళ‌వారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌ని పేర్కొంది. ఇక బుధ‌వారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌ని పేర్కొంది. అలాగే, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో గంట‌కు 50-60 కిలోమీట‌ర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపుల‌తో కూడిన వాన‌లు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, జ‌న‌గాం, సిద్దిపేట‌, భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని వివ‌రంచింది.

ఈ జిల్లాల్లో ఈదురుగాలుల‌తో వాన‌లు..

గురువారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గాం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మ‌ల్‌, న‌ల్గొండ‌, సిద్దిపేట‌, భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని వివ‌రించింది. శుక్ర‌వారం మంచిర్యాల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం జిల్లాల్లో అతిభారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, పెద్ద‌ప‌ల్లి, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని వివ‌రించింది. శుక్ర‌, శ‌నివారాల్లో తెలంగాణ‌వ్యాప్తంగా అక్క‌డ‌క్క‌డ ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వివ‌రించింది.

వాయుగుండంగా అల్ప‌పీడ‌నం..

బంగాళాఖాతంలో ఏర్పడిన సుస్పష్టమైన అల్పపీడన ప్రాంతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. సోమవారం ఉదయం 8.30 గంటలకు పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న చక్రవాత వలయం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంద‌ని పేర్కొంది. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాతి 24 గంటల్లో పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 23 ఉదయం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్‌–దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలోకి చేరే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం నుంచి సుస్పష్టమైన అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉన్న చక్రవాత వలయం కేంద్రం వరకు ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి మధ్య తమిళనాడు, పరిసర ప్రాంతాలపై 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న పైస్థాయి అల్పపీడన ప్రాంతానికి అనుబంధ చక్రవాత వలయం వరకు మరో ద్రోణి విస్తరించి ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌, ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఎగువ గాలి చక్రవాత వలయం.. బంగాళాఖాతంలోని సుస్పష్టమైన అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉన్న చక్రవాత వలయంలో విలీనమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

 

Advertisement
Advertisement