Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ – సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్
తన సోదరి అంబికపై సీనియర్ హీరోయిన్ రాధ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. తాను సంతకం చేసిన ఖాళీ చెక్కులను దొంగిలించి వాటి ద్వారా యాభై కోట్లు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించారని అంబికతో పాటు సోదరుడు మల్లిఖార్జున్‌లపై చెన్నై కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది.
Entertainment | Published On Sep 21, 2026, 5.50 pm IST
Heroine Radha | యాభై కోట్లు దొంగతనం చేసేందుకు ప్రయత్నించిందని తన సోదరి అంబికపై సీనియర్ హీరోయిన్ రాధ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అంబికతో పాటు సోదరుడు మల్లిఖార్జున్‌లపై చెన్నై పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది.
ఖాళీ చెక్కులు...
చెన్నైలోని వలసరవాక్కంలో హీరోయిన్ రాధ తన కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. సిబ్బంది జీతాలు, ఇతర వ్యాపార అవసరాల నిమిత్తం కొన్ని ఖాళీ చెక్కులపై సంతకం చేసి తన గదిలో దాచిపెట్టారు. తాను ఊళ్లో లేని సమయంలో ఆ గదిలోకి వచ్చిన అంబిక చెక్కులను దొంగిలించినట్లు రాధ తన ఫిర్యాదులో పేర్కొన్నది. తాను సంతకాలు చేసిన ఆ చెక్కులు అంబిక పేరు మీద బ్యాంకులో విత్‌డ్రా కోసం వచ్చినట్లు బ్యాంకు నుంచి మెయిల్ వచ్చిందని రాధ చెప్పింది. ఈ చెక్కుల ద్వారా యాభై కోట్లు విత్‌డ్రా చేసేందుకు అంబికతో పాటు తన సోదరుడు మల్లిఖార్జున్ ప్రయత్నించారని , బ్యాంకు అధికారుల సమాచారంతో తాను ఆ లావాదేవీలను నిలిపివేసినట్లు చెప్పింది.
ఆభరణాలు..
ఖాళీ చెక్కులను అంబిక దొంగిలించగా...వాటిని బ్యాంకులో మల్లిఖార్జున్ జమ చేశాడని రాధ అన్నది. చెక్కులను దొంగిలించడమే కాకుండా తన గదిలో ఉన్న బంగారం, వజ్రాల ఆభరణాలను తీసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నది. మల్లిఖార్జున్‌తో పాటు అంబికతో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని రాధ అన్నది.
టాప్ హీరోయిన్...
తెలుగు, తమిళ భాషల్లో 1980 దశకంలో అగ్రనాయికగా పేరుతెచ్చుకుంది రాధ. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో పలు సూపర్‌హిట్ సినిమాలు చేసింది. దొంగ, అడవి దొంగ, గూండ, కొండవీటి రాజా, సింహాసనంతో పలు సినిమాలు ఆమెకు మంచి పేరుతెచ్చిపెట్టాయి. రాధతో పాటు అంబిక కూడా అగ్ర నాయికగా కొనసాగింది. తెలుగులో యముడికి మొగుడు, నాయుడుగారి పెళ్లి, బొబ్బిలి పెళ్లి పలు సినిమాలు చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు – రష్మిక మందన్న మైసా టీజర్ రిలీజ్
సెప్టెంబర్ 20, 2026

Nani Paradise | తెలంగాణలో నాని ప్యారడైజ్ టికెట్ ధరల పెంపు – బెనిఫిట్ షోకు అనుమతి
సెప్టెంబర్ 20, 2026

Keerthy Suresh | నానితో కీర్తి సురేష్ బాక్సాఫీస్ ఫైట్ – ఒక్క రోజు గ్యాప్‌లో మహానటి రెండు సినిమాలు రిలీజ్
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..
- ●DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు
- ●UP Teacher Shot Dead | దారుణం.. విద్యార్థుల ఎదుటే టీచర్‌ను కాల్చి చంపాడు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా
- ●Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..
- ●V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి

TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..

DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు

UP Teacher Shot Dead | దారుణం.. విద్యార్థుల ఎదుటే టీచర్‌ను కాల్చి చంపాడు

Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా



