త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Husband Killed | చీర‌లు కొనివ్వ‌లేద‌ని.. భ‌ర్త‌ను చంపేసిన భార్య‌

Husband Killed | ఆమెకు చీర‌లంటే ఇష్టం.. రోజుకో కొత్త చీర‌తో మెరిసిపోవాల‌నుకుంటుంది. కానీ భ‌ర్త ఆమె బాధ‌ను అర్థం చేసుకోలేదు. చివ‌ర‌కు చీర‌ల విష‌యంలో చెల‌రేగిన వివాదం.. భ‌ర్త ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది.

S

National | Published On Jul 23, 2026, 1.26 pm IST

Husband Killed | చీర‌లు కొనివ్వ‌లేద‌ని.. భ‌ర్త‌ను చంపేసిన భార్య‌
Advertisement

Husband Killed | త్రినేత్ర‌.న్యూస్ : ఆమెకు చీర‌లంటే ఇష్టం.. రోజుకో కొత్త చీర‌తో మెరిసిపోవాల‌నుకుంటుంది. కానీ భ‌ర్త ఆమె బాధ‌ను అర్థం చేసుకోలేదు. చివ‌ర‌కు చీర‌ల విష‌యంలో చెల‌రేగిన వివాదం.. భ‌ర్త ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్ రోహ‌త‌క్ జిల్లాకు చెందిన సునీతాదేవి హ‌రేరామ్ సింగ్‌(30)కు హ‌రేరామ్ కిష‌న్‌జీ సింగ్‌(35)తో వివాహ‌మైంది. అయితే బతుకుదెరువు కోసం మ‌హారాష్ట్ర‌కు వ‌చ్చారు. బ‌ద్లాపూర్‌లో నివాస‌ముంటున్నారు. భార్య సునీతాదేవికి చీర‌లంటే మ‌హాపిచ్చి. కానీ భ‌ర్త ఆమెకు చీర‌ల‌ను కొనివ్వ‌డం లేదు.

ఈ చీర‌ల విష‌యంలోనే జూలై 19న రాత్రి భార్యాభ‌ర్త‌ల‌కు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స‌హ‌నం కోల్పోయిన భార్య‌.. భ‌ర్త‌పై ప్రెష‌ర్ కుక్క‌ర్ మూత‌తో దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాల‌పాలై స్పృహ కోల్పోయాడు. ఆ త‌ర్వాత గొంతు నులిమి హ‌త్య చేసింది.

అయితే ప్ర‌మాద‌వ‌శాత్తు భ‌ర్త చ‌నిపోయిన‌ట్లు భార్య సునీతా దేవి నాట‌క‌మాడింది. కానీ పోస్టుమార్టం రిపోర్టులో హ‌త్య‌కు గురైన‌ట్లు తేలింది. దీంతో సునీతను పోలీసులు లోతుగా విచారించ‌గా తానే హ‌త్య చేసిన‌ట్లు అంగీక‌రించింది. అనంత‌రం ఆమెను పోలీసులు కోర్టులో హాజ‌రు ప‌రిచారు. కోర్టు ఆమెకు జ్యూడిషియ‌ల్ రిమాండ్ విధించింది.

Advertisement
Advertisement