Korutla | బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సు చోరీ.. 18 కి.మీ. వెంబడించి పట్టుకున్న పోలీసులు
Korutla | జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఓ ఆర్టీసీ బస్సును ఓ ఆగంతకుడు తీసుకెళ్లాడు. గమనించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్లు పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో పోలీసులు 18 కిలోమీటర్లు వెంబడించి ఆ బస్సును పట్టుకున్నారు.
Korutla | త్రినేత్ర.న్యూస్ : జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఓ ఆర్టీసీ బస్సును ఓ ఆగంతకుడు తీసుకెళ్లాడు. గమనించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్లు పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో పోలీసులు 18 కిలోమీటర్లు వెంబడించి ఆ బస్సును పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కోరుట్ల బస్ డిపోకు చెందిన టీఎస్ 08జెడ్ 0103 నంబర్ బస్సును డ్రైవర్ ప్రవీణ్ కోరుట్ల బస్టాండ్‌లోని 8వ నంబర్ ప్లాట్‌ఫైం నిలిపి ఉంచాడు. ఇక కండక్టర్‌తో కలిసి డ్రైవర్ టీ తాగేందుకు వెళ్లాడు. ఇంతలోనే బస్సులోకి ప్రవేశించిన ఓ గుర్తు తెలియని ఆగంతకుడు.. బస్సును స్టార్ట్ చేసి అక్కడ్నుంచి నిష్క్రమించాడు. నిజామాబాద్ వైపు బస్సును తీసుకెళ్లాడు.
గమనించి ఆర్టీసీ సిబ్బంది.. తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూడా క్షణాల్లోనే బస్సును ఫాలో అయ్యారు. వెనుకాలే పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించి ఆగంతకుడు మరింత వేగంగా నడుపుతూ మూడు బైక్‌లను ఢీకొట్టాడు. వాహనదారులు స్వల్పంగా గాయపడ్డారు.
చివరగా పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా.. అక్కడి సిబ్బంది మెట్‌పల్లి మండల పరిధిలోని గండి హనుమాన్ సమీపంలో జాతీయ రహదారికి అడ్డుగా భారీ వాహనాలు నిలిపి ఉంచారు. దీంతో బస్సు ముందుకెళ్లే దారి లేక దుండగుడు పక్కనున్న చెట్టును ఢీకొట్టి నిలిపివేశాడు. పారిపోయే యత్నం చేయగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
తాజావార్తలు
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!






