త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balkampet Yellamma | అక్రిడిటేష‌న్ కార్డుకు విలువ లేదు.. జ‌ర్న‌లిస్టుకు అవ‌మానం.. వీడియో

Balkampet Yellamma | తెలంగాణ రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టుల ప‌రిస్థితి అత్యంత ద‌య‌నీయంగా మారింది. రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా జారీ చేసిన అక్రిడిటేష‌న్ కార్డుల‌కు విలువ లేకుండా పోయింది. పోలీసులు జ‌ర్న‌లిస్టుల ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తిస్తూ ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు.

S

Telangana | Published On Jul 22, 2026, 12.59 pm IST

Balkampet Yellamma | అక్రిడిటేష‌న్ కార్డుకు విలువ లేదు.. జ‌ర్న‌లిస్టుకు అవ‌మానం.. వీడియో
Advertisement

Balkampet Yellamma | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టుల ప‌రిస్థితి అత్యంత ద‌య‌నీయంగా మారింది. రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా జారీ చేసిన అక్రిడిటేష‌న్ కార్డుల‌కు విలువ లేకుండా పోయింది. పోలీసులు జ‌ర్న‌లిస్టుల ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తిస్తూ ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు.

అయితే ఇంగ్లీష్ డైలీ తెలంగాణ టుడే దిన‌ప‌త్రిక‌కు చెందిన సీనియ‌ర్ ఫొటోగ్రాఫ‌ర్ ఆనంద్ ధ‌ర్మ‌నకు బ‌ల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆల‌యం వ‌ద్ద అవ‌మానం జ‌రిగింది. అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి త‌ర‌లివ‌స్తున్న భ‌క్తుల ఫొటోల క‌వ‌రేజీ కోసం వెళ్లిన స‌ద‌రు ఫొటోగ్రాఫ‌ర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అక్రిడిటేష‌న్ కార్డు చూపించిన‌ప్ప‌టికీ ఆ కార్డుకు విలువ లేద‌ని పోలీసులు తేల్చిచెప్పారు. అక్క‌డ్నుంచి మెడ‌ప‌ట్టి గెంటేసినంత ప‌ని చేశారు పోలీసులు. ప్ర‌భుత్వం జారీ చేసిన అక్రిడిటేష‌న్ కార్డే క‌దా..? త‌మ‌ను అనుమ‌తించండి అని అడిగిన‌ప్ప‌టికీ పోలీసులు వినిపించుకోలేదు. ఈ ఘ‌ట‌న‌పై జ‌ర్న‌లిస్టులు మండిప‌డుతున్నారు. ఇదేమీ అన్యాయం అని నిప్పులు చెరుగుతున్నారు.

Advertisement
Advertisement