Chalo Parliament | సీజేపీ చలో పార్లమెంట్.. ఢిల్లీలో హై అలర్ట్.. 144 సెక్షన్ విధింపు
Chalo Parliament | నీట్ పరీక్షలో అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా, విద్యా వ్యవస్థలో ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చలో పార్లమెంట్ (Chalo Parliament) నిరసనకు పిలుపునిచ్చింది.
Chalo Parliament | త్రినేత్ర.న్యూస్: నీట్ పరీక్షలో అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా, విద్యా వ్యవస్థలో ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చలో పార్లమెంట్ (Chalo Parliament) నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో 144 సెక్షన్ (Section144) విధించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడటానికి వీళ్లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. 5 వేల మందికిపైగా బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా హై సెక్యూరిటీ జోన్‌లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
విజయ్ చౌక్, పార్లమెంట్ స్ట్రీట్, ప్రధాని నివాసం, సేవా తీర్థ్, ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్ వంటి హై సెక్యూరిటీ ప్రాంతాల్లో ఎలాంటి నిరసనలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు సీజేపీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీలోని (Delhi) జంతర్ మంతర్‌కు ఆదివారం రాత్రికే పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. దాదాపు 20 వేల మంది అక్కడ గుమిగూడినట్లు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు.
నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమవుతాయి.తొలిరోజు సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పెంపు బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33 నుంచి 37కు పెంచుతూ బిల్లులో ప్రతిపాదనలు చేశారు. వందేమాతరం గేయానికి జాతీయ గీతం హోదా కల్పిస్తూ `జాతీయ గౌరవానికి అవమానాల నివారణ చట్ట (సవరణ)` బిల్లును రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టనున్నారు. అయోధ్యలో విరాళాల చోరీ అంశం పార్లమెంటులో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. నీట్, సీబీఎస్ఈ ప్రశ్న పత్రాల లీకేజీ సహా పలు అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుపట్టే అవకాశం ఉంది.
#WATCH | Delhi: Visuals from outside Safdarjung Hospital, where activist Sonam Wangchuk has been admitted.
Dr Prof Manisha Thakur, HOD Medicine, Safdarjung Hospital, said yesterday that he is under close monitoring and observation. His vital parameters are stable. pic.twitter.com/1FScTnBwQF
— ANI (@ANI) July 20, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






