Jubilee Hills CI | ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను లోబర్చుకున్నాడు.. జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు
Jubilee Hills CI | హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై (Jubilee Hills CI) సస్పెన్షన్ వేటు పడింది. ఫిర్యాదు చేయడానికి వచ్చి ఓ మహిళలకు మాయమాటలు చెప్పి లోబరచుకోవడంతోపాటు, ఆమె వ్యక్తిగత వీడియోలు చూపించి డబ్బులు వసూలు చేసినట్లు తేలడంతో సీపీ సజ్జనర్ ఆయనను సస్పెండ్ (suspended) చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
Jubilee Hills CI | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై (Jubilee Hills CI) సస్పెన్షన్ వేటు పడింది. ఫిర్యాదు చేయడానికి వచ్చి ఓ మహిళలకు మాయమాటలు చెప్పి లోబరచుకోవడంతోపాటు, ఆమె వ్యక్తిగత వీడియోలు చూపించి డబ్బులు వసూలు చేసినట్లు తేలడంతో సీపీ సజ్జనర్ ఆయనను సస్పెండ్ (suspended) చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో జూబ్లీహిల్స్ పీఎస్ బాధ్యతలు చేపట్టిన 4 నెలల్లోనే సస్పెన్షన్‌కు గురికావడం గమనార్హం.
పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాలిని నమ్మించిన ఇన్‌స్పెక్టర్.. ఆమెతో సన్నిహితంగా మెలుగుతూ ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. వాటిని చూపి పెద్దఎత్తున డబ్బు వసూలు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని, అబార్షన్ చేయించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఇన్‌స్పెక్టర్‌పై అంతర్గత విచారణకు ఆదేశించారు.
మహిళ వ్యక్తిగత వీడియోలను అడ్డంగా పెట్టుకుని డబ్బులు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. కొంతకాలంపాటు సీఐ శ్రీనివాసులు రెడ్డి (Srinivasulu Reddy), బాధిత మహిళ ఒకే ఇంట్లో ఉన్నట్లు తేలింది. అనంతరం ఆమెను వదిలించుకునేందుకు సీఐ ప్రయత్నాలు చేసినట్లు తేలడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా సీఐని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Heavy Rains | హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లపై బారులు తీరిన వాహనాలు
జులై 28, 2026

Prajavani | ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
జులై 28, 2026

Chanagani Dayakar | హైడ్రా వచ్చాక 3,350 ఎకరాల భూమి కాపాడింది.. బీఆర్ఎస్ ఆక్రమణలను కూల్చినందుకే ఈ దుష్ప్రచారం
జులై 28, 2026
తాజావార్తలు
- ●UP Viral Wedding | అది ఉత్తుత్తి పెండ్లి.. సోషల్ మీడియా ప్రాంక్..
- ●Horoscope | జూలై 29 రాశిఫలాలు.. మీ మాటలతో జాగ్రత్త.. లేకపోతే!
- ●KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
- ●Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్
- ●CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్

UP Viral Wedding | అది ఉత్తుత్తి పెండ్లి.. సోషల్ మీడియా ప్రాంక్..

Horoscope | జూలై 29 రాశిఫలాలు.. మీ మాటలతో జాగ్రత్త.. లేకపోతే!

KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్



