త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Headmaster | మద్యం తాగుతూ.. బూతు పాట‌లు చూస్తూ.. పాఠ‌శాల‌ను ప‌బ్‌గా మార్చిన ప్ర‌ధానోపాధ్యాయుడు

Headmaster | పిల్ల‌ల‌కు విద్యాబుద్ధులు చెప్పి, క్ర‌మశిక్ష‌ణ నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు (Headmaster) త‌ప్పుదారిప‌ట్టాడు. దేవాల‌యంగా భావించే పాఠ‌శాల‌ను ఓ ప‌బ్బుగా మార్చేశాడు.

G

National | Published On Jul 11, 2026, 9.33 am IST

Headmaster | మద్యం తాగుతూ.. బూతు పాట‌లు చూస్తూ.. పాఠ‌శాల‌ను ప‌బ్‌గా మార్చిన ప్ర‌ధానోపాధ్యాయుడు
Advertisement

Headmaster | త్రినేత్ర‌.న్యూస్‌: పిల్ల‌ల‌కు విద్యాబుద్ధులు చెప్పి, క్ర‌మశిక్ష‌ణ నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు (Headmaster) త‌ప్పుదారిప‌ట్టాడు. దేవాల‌యంగా భావించే పాఠ‌శాల‌ను ఓ ప‌బ్బుగా మార్చేశాడు. రోజూ టంఛ‌న్‌గా స్కూలుకు వ‌చ్చే అత‌డు విద్యార్థుల‌కు పాటాలు చెప్పాల్సిన త‌ర‌గ‌తి గ‌దిని అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు (Anti-social elements) అడ్డాగా చేసుకున్నాడు.

ర‌మేశ్ చంద్ర (Ramesh Chandra) అనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని (Uttar Pradesh) మ‌హోబా జిల్లాలోని ఓ ప్ర‌భుత్వ ప్రాథ‌మిక పాఠ‌శాలలో (Primary School) హెడ్‌మాస్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. రోజూ స్కూలుకు వెళ్లే అత‌డు పూటుగా మద్యం తాగి (Alcohol), త‌ర‌గ‌తిగ‌దిలో బెంచీల‌పై ప‌డుకునే వాడు. పైగా డిజిట‌ల్ పాటాలు చెప్ప‌డానికి ఏర్పాటుచేసిన టీవీలో బూతు పాటలు (Vulgar Video Songs) చూస్తూ ఎంజాయ్ చేయ‌సాగాడు. అంత‌టితో ఆగ‌కుండా రోజూ స్కూలు ఆవ‌ర‌ణ‌లో బ‌ట్ట‌ల‌న్నీ విప్పేసి ట‌వ‌ల్‌పై తిరిగేవాడు. విద్యార్థుల‌తో అస‌భ్యంగా మాట్లాడేవాడు. అత‌ని వ్య‌వ‌హారాన్ని చాలారోజుల పాటు గ‌మ‌నించిన గ్రామ‌స్థులు జిల్లా విద్యాశాఖ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. తాగి త‌ర‌గ‌తిగ‌దిలో బెంచీల‌పై ప‌డుకుంటున్నాడ‌ని, స్కూల్‌ను అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు వేదిక‌గా మార్చాడ‌ని చెప్పారు. ఈ విష‌యం ఎవ‌రితోనైనా చెబితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడ‌తానంటూ పిల్ల‌ల‌ను బెదిరిస్తున్నాడ‌ని పేర్కోన్నారు.

ఆక‌స్మిక త‌నిఖీ.. స‌స్పెండ్..

ఫిర్యాదుల నేప‌థ్యంలో అసిస్టెంట్ బ్యాక్ ఎడ్యుకేష‌న్ ఆఫీస‌ర్ అశ్వినీ యాద‌వ్ స్కూల్‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఆ స‌మ‌యంలో ర‌మేశ్ చంద్ర క్లాస్‌రూమ్‌లో అస‌భ్యంగా దుస్తులు ధ‌రించి బెంచీపై ప‌డుకుని, టీవీలో బూతు పాట‌లు చూస్తూ, మ‌ద్యం సీసాతో క‌నిపించాడు. దీంతో అక్క‌డే అత‌డిని స‌స్పెండ్ (Suspended) చేశారు. అత‌నిపై శాఖాప‌ర‌మైన విచార‌ణ‌కు ఆదేశించారు.

Advertisement
Advertisement