Bank Employee | నేను ఠాకూర్ కులానికి చెందిన దాన్ని.. నాతో పెట్టుకోకు.. కస్టమర్‌ను దూషించిన బ్యాంకు ఉద్యోగిని
Bank Employee | ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లోని కాన్పూర్ (Kanpur)లో గల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (HDFC Bank)లో ఓ మహిళా ఉద్యోగి వీరంగం సృష్టించింది. కస్టమర్ పట్ల అనుచితంగా ప్రవర్తించింది. దుర్బాషలాడుతూ.. అమర్యాదకర పదజాలంతో దూషించింది.
Bank Employee | కస్టమర్లను బ్యాంకులు దేవుళ్లుగా భావిస్తాయి. ఎందుకంటే కస్టమర్లు ఉంటేనే బ్యాంకులకు లాభాలు. అందుకే కస్టమర్ల పట్ల ఎంతో పర్యాదపూర్వకంగా వ్యవహరిస్తాయి బ్యాంకులు. కానీ కొందరు బ్యాంకు ఉద్యోగుల (Bank Employees) ప్రవర్తన మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. తాజాగా ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగిని కస్టమర్‌పట్ల ప్రవర్తించిన తీరు చర్చకు దారి తీస్తోంది.
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లోని కాన్పూర్ (Kanpur)లో గల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (HDFC Bank)లో ఓ మహిళా ఉద్యోగి వీరంగం సృష్టించింది. కస్టమర్ పట్ల అనుచితంగా ప్రవర్తించింది. దుర్బాషలాడుతూ.. అమర్యాదకర పదజాలంతో దూషించింది. నేను ఠాకూర్ కులానికి చెందిన దాన్ని.. నాతో పెట్టుకోవద్దు అంటూ హెచ్చరించింది. అంతటితో ఆగని ఆమె తన ల్యాప్‌టాప్‌తో కస్టమర్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించింది. బ్యాంకులో ఉద్యోగులు, కస్టమర్లు ఉన్న సమయంలోనే ఇదంతా జరిగింది. అక్కడే ఉన్న కొందరు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.
దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఉద్యోగుల వల్ల బ్యాంకు ప్రతిష్ట దెబ్బతింటుందంటూ కామెంట్లు పెడుతున్నారు. కస్టమర్ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించిన ఆ ఉద్యోగినిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇప్పటివరకూ స్పందించలేదు.
https://x.com/SurajKrBauddh/status/2020543815871082997
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






