Bandi Sanjay | దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర : బండి సంజయ్
Bandi Sanjay | త్రినేత్ర.న్యూస్ : దేశ అంతర్గత భద్రతలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నక్సలిజం, ఉగ్రవాద నిర్మూలనలో సీఆర్పీఎఫ్ జవాన్లు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.
దేశంలో అతిపెద్ద పారామిలటరీ సంస్థ సీఆర్పీఎఫ్
ధైర్యం, నిజాయితీ, త్యాగం, సమర్పణకు ప్రతీక
మానవతా దృక్పథంలోనూ సీఆర్పీఎఫ్ ముందంజ
సీఆర్పీఎఫ్ సేవలను కొనియాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్
హర్యానా గురుగ్రాం సీఆర్పీఎఫ్ స్నాతకోత్సవ వేడుకలను వీక్షించిన కేంద్ర మంత్రి
Bandi Sanjay | త్రినేత్ర.న్యూస్ : దేశ అంతర్గత భద్రతలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నక్సలిజం, ఉగ్రవాద నిర్మూలనలో సీఆర్పీఎఫ్ జవాన్లు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ధైర్యం, నిజాయితీ, త్యాగం, సమర్పణకు సీఆర్పీఎఫ్ ప్రతీకగా నిలిచిందన్నారు. మానవతా సాయం అందించడంలోనూ సీఆర్పీఎఫ్ ముందంజలో ఉండటం ప్రశంసనీయమని కొనియాడారు.
బుధవారం ఉదయం హర్యానాలోని గురుగ్రాం సీఆర్పీఎఫ్ అకాడమీలో జరిగిన 56వ బ్యాచ్ గెజిటెడ్ అధికారుల స్నాతకోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, అకాడమీ డైరెక్టర్ అమిత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తొలుత అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి అంజలి ఘటించిన కేంద్ర మంత్రి అనంతరం స్నాతకోత్సవ వేడుకలను తిలకించారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ పోలీసులను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగించారు.

CRPF 56వ బ్యాచ్ శిక్షణార్థి అధికారుల స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన స్నాతకోత్సవ పరేడ్ సీఆర్‌పీఎఫ్ అత్యున్నత స్థాయి క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తోంది. పరేడ్‌లో పాల్గొన్న అధికారులు 52 వారాల కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని విధులకు సిద్ధమవడం సంతోషం. మాతృభూమికి సేవ చేయడానికి తమను తాము అంకితం చేసుకోవడం కంటే గొప్ప కర్తవ్యం మరొకటి లేదు. దేశసేవ అనే పవిత్ర ప్రతిజ్ఞే అత్యున్నత కర్తవ్య నిబద్ధతకు సంకేతం, ఇది ఏ పౌరుడైనా తన దేశం కోసం తీసుకోగలిగే అత్యుత్తమ ప్రతిజ్ఞ. దేశసేవలో సమర్పణ, నిబద్ధత, త్యాగం అంతర్భాగాలుగా ఉంటాయి. సీఆర్‌పిఎఫ్ యొక్క ఆదర్శ వాక్యం ‘సేవ మరియు నిష్ఠ’. సవాళ్లతో కూడిన ఈ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను.
సీఆర్‌పిఎఫ్ దేశంలోని అతిపెద్ద సాయుధ పోలీస్ దళం. దేశంలో అంతర్గత భద్రతను కాపాడటంలో ఈ దళం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. రాబోయే కాలంలో మీరందరు ఈ బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తారని నాకు విశ్వాసం ఉంది. 1939లో కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఏర్పడినప్పటి నుండి కర్తవ్య నిబద్ధత, వీరత్వానికి నిదర్శనంగా ఉంది. ఈ దళం నేడు ధైర్యం, నిజాయితీ, త్యాగం, సమర్పణకు ప్రతీకగా నిలిచింది.

జమ్మూ-కాశ్మీర్, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించడంలో ఈ దళం కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలో అంతర్గత భద్రతకు సంబంధించిన ఈ సవాళ్లను ఎదుర్కొనడానికి ఈ దళానికి దృఢమైన నాయకత్వం అవసరం. శిక్షణ పొందిన అధికారుల నుండి ఇదే ఆశిస్తున్నాం.
పార్లమెంట్ భవనంపై జరిగిన ఉగ్ర దాడిని విఫల పరచడంలో సీఆర్‌పిఎఫ్ కీలక పాత్ర పోషించింది. స్థాపన నుంచి ఇప్పటి వరకు వివిధ ఆపరేషనల్ రంగాల్లో వీరత్వానికి ఈ దళం అనేక విశిష్ట విజయాలను సాధించింది. సీఆర్పీఎఫ్ ధైర్యం, త్యాగానికి నిదర్శనం. దేశంలోని అంతర్గత భద్రతతో పాటు, కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం అంతర్జాతీయ స్థాయిలో కూడా శాంతి దళంగా పనిచేస్తూ వివిధ ప్రాంతాల్లో శాంతి స్థాపనకు ముఖ్యమైన సేవలను అందించింది.
సీఆర్పీఎఫ్‌కు మానవతా దృక్పథం కూడా ఉంది. పౌరుల మానవ హక్కులను గౌరవిస్తూ, సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ కింద అవసరమైన పౌరులకు సహాయం చేస్తోంది. అనేక ఇతర సేవలను కూడా అందిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాన్ని నియమించడం, భాగస్వామ్యం పెరుగుతుండటం, ఎక్కడ నియమించినా ఈ దళం తన సేవాభావంతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నదానికి నిదర్శనం.
డ్యూటీ సమయంలో సవాళ్లు మరింతగా పెరుగుతాయి. పరిస్థితులు భిన్నంగా, ప్రతికూలంగా ఉండే అవకాశముంది. అయినప్పటికీ మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి విజయవంతంగా అమలు చేస్తూ పనితీరును నిరంతరం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కృషి, నిజాయితీ, క్రమశిక్షణ, దేశభక్తి భావనలు కఠినమైన, క్లిష్ట పరిస్థితుల్లో ముందుకు సాగడానికి ప్రేరణ ఇస్తాయి. దేశ అంతర్గత భద్రతను కాపాడటానికి, సమాజ వ్యతిరేక శక్తులను ఎదుర్కొనేందుకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, విలువలు, సామర్థ్యంతో సదా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది.
“నేషన్ ఫస్ట్” అనే లక్ష్యంతో వృత్తిపరమైన ప్రతిభ, నిజాయితీ, అఖండతకు అత్యున్నత ప్రమాణాలను పాటించాలి. గెజిటెడ్ అధికారులు వీటిని పాటిస్తే... మిగిలిన వారంతా అనుసరిస్తారు. సీఆర్‌పిఎఫ్ జాతీయ లక్ష్యాల పట్ల తమ నిబద్దతను కొనసాగించేందుకు నిరంతర కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాని తెలుపుతూ బండి సంజయ్ తన ప్రసంగాన్ని ముగించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



