త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ban | హ‌రిజ‌నులు, గిరిజ‌నులు.. అక్కడ‌ ఈ ప‌దాల‌ వాడ‌కంపై నిషేధం

Ban | హ‌రిజ‌నులు (Harijan), గిరిజనులు (Girijan) అనే ప‌దాల వాడ‌కంపై హ‌ర్యానా ప్ర‌భుత్వం నిషేధం (Ban) విధించింది. ఇక‌పై ప్ర‌భుత్వ విభాగాలు, విద్యా సంస్థ‌ల్లో, ప్ర‌జ‌లు ఈ ప‌దాల‌ను వాడుక‌లో ఉప‌యోగించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

G

National | Published On Jan 14, 2026, 9.58 am IST

Ban | హ‌రిజ‌నులు, గిరిజ‌నులు.. అక్కడ‌ ఈ ప‌దాల‌ వాడ‌కంపై నిషేధం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: హ‌రిజ‌నులు (Harijan), గిరిజనులు (Girijan) అనే ప‌దాల వాడ‌కంపై హ‌ర్యానా ప్ర‌భుత్వం నిషేధం (Ban) విధించింది. ఇక‌పై ప్ర‌భుత్వ విభాగాలు, విద్యా సంస్థ‌ల్లో, ప్ర‌జ‌లు ఈ ప‌దాల‌ను వాడుక‌లో ఉప‌యోగించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు హ‌ర్యానా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదేశాలు జారీచేశారు.

రాష్ట్రంలోని అన్ని శాఖ‌ల కార్య‌ద‌ర్శులు, శాఖ అధిప‌తులు, బోర్డులు, కార్పొరేష‌న్లు, ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచే సంస్థ‌లు, డివిజ‌న‌ల్ క‌మిష‌న‌ర్లు, డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, స‌బ్ డివిజ‌న‌ల్ ఆఫీస‌ర్లు (సివిల్‌), యూనివ‌ర్సిటీల రిజిస్ట్రార్లకు హ‌రిజ‌నులు, గిరిజ‌నుల ప‌దాల వాడ‌కంపై స్ప‌ష్ట‌మైన ఆదేవాలు జారీచేశామ‌ని, ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాలు, అధికారిక రికార్డులు, ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాలు, స‌మాచార మార్పిడిలో ఇక‌పై ఈ ప‌దాల‌ను వాడ‌కంపై నిషేధం విధించామ‌ని అందులో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల‌ను ఇలా పివ‌డం రాజ్యాంగానికి వ్య‌తిరేకమ‌ని తెలిపారు. ఈ విష‌యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పూర్తిగా పాటించాలని సూంచిచారు. కాగా, ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు ఈ ప‌దాల వాడ‌కంపై నిషేధం విధించాయి.

కించపరిచేలా మారిన పదం

మహాత్మాగాంధీ (Mahatma Gandhi) స్వయంగా హరిజన అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ కాలక్రమేణా ఈ పదం గౌరవప్రదమైనదిగా కాకుండా, కొందమందికి కించపరిచేదిగా మారిపోయింది. దీంతో పలు సంఘాలు ఈ పదాన్ని అధికారికంగా తొలగించాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఒడిశా ప్ర‌భుత్వం గ‌తేడాదే హ‌రిజ‌నులు అనే ప‌దం వాడ‌కాన్ని నిషేధించింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం

హరిజన పదానికి బదులుగా, షెడ్యూల్డ్ కులం, అనునుచి జాతి పదాలను వాడాలని సూచించింది. అయితే సర్కారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 1982లోనే దళితులను ఉద్దేశించి ‘హరిజన’ అనే పదాన్ని వాడకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు ఇచ్చింది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement