త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amazon Great Republic Day Sale 2026 | అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌.. ఫోన్ల‌పై 40 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌..

Amazon Great Republic Day Sale 2026 | ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ ప్ర‌తి ఏడాది లాగే ఈసారి కూడా త‌న గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను ప్రారంభించ‌నుంది. జ‌న‌వ‌రి 16 నుంచి ఈ సేల్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. ఈ సేల్‌లో భాగంగా ప‌లు కంపెనీల‌కు చెందిన ఉత్పత్తుల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌ను, రాయితీల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది.

S

Business | Published On Jan 14, 2026, 11.03 am IST

Amazon Great Republic Day Sale 2026 | అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌.. ఫోన్ల‌పై 40 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌..
Advertisement

Amazon Great Republic Day Sale 2026 | ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ ప్ర‌తి ఏడాది లాగే ఈసారి కూడా త‌న గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను ప్రారంభించ‌నుంది. జ‌న‌వ‌రి 16 నుంచి ఈ సేల్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. ఈ సేల్‌లో భాగంగా ప‌లు కంపెనీల‌కు చెందిన ఉత్పత్తుల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌ను, రాయితీల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. సేల్ ప్రారంభానికి ముందే కొన్ని డీల్స్‌ను అమెజాన్ వెల్ల‌డించింది. ఇక అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ల‌కు అద‌న‌పు బెనిఫిట్స్ కూడా ఉంటాయ‌ని తెలిపింది. ఈ సేల్‌లో ఎల‌క్ట్రానిక్స్‌తోపాటు యాక్స‌సరీల‌పై 75 శాతం వ‌ర‌కు రాయితీల‌ను అందిస్తున్న‌ట్లు తెల‌ప‌గా, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల‌తో నిర్వ‌హించే ఈఎంఐ లావాదేవీల‌పై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది.

యాపిల్‌, వ‌న్‌ప్ల‌స్ ఫోన్ల‌పై..

ఈ సేల్‌లో భాగంగా యాపిల్‌కు చెందిన పలు ఐఫోన్ మోడ‌ల్స్‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందించ‌నున్నారు. ఐఫోన్ 15కు చెందిన 128జీబీ మోడ‌ల్ ధ‌ర ఈ సేల్‌లో రూ.50,249గా ఉండ‌నుంది. అలాగే ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ 256జీబీ మోడ‌ల్ కాస్మిక్ ఆరెంజ్ వేరియెంట్ ధ‌ర రూ.1,40,400గా ఉంది. ఐఫోన్ 17 ప్రొ 256జీబీ స్టోరేజ్ కాస్మిక్ ఆరెంజ్ మోడ‌ల్‌ను రూ.1,25,400కు విక్ర‌యించ‌నున్నారు. ఐఫోన్ ఎయిర్ 256జీబీ స్టోరేజ్ స్కై బ్లూ క‌ల‌ర్ మోడ‌ల్‌ను రూ.91,249కు విక్ర‌యిస్తున్న‌ట్లు తెలిపింది. అలాగే ప‌లు వ‌న్‌ప్ల‌స్ ఫోన్ల‌పై కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. వ‌న్‌ప్ల‌స్ 15ను ఈ సేల్‌లో రూ.68,999కు కొన‌వ‌చ్చు. వ‌న్‌ప్ల‌స్ 15ఆర్ ధ‌ర రూ.44,999, వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 5 ధ‌ర రూ.30,999, వ‌న్‌ప్ల‌స్ 13ఆర్‌, 13 ధ‌ర‌లు వ‌రుస‌గా రూ.37,999, రూ.57,999గా ఉండ‌నున్నాయి.

శాంసంగ్ ఫోన్ల‌పై..

ఈ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్ 6 ఫోన్‌ను రూ.1,04,999కు కొన‌వ‌చ్చు. గెలాక్సీ ఎ55 5జి ఫోన్ ధ‌ర రూ.23,999గా ఉండ‌నుంది. గెలాక్సీ ఎం17 5జి ధ‌ర రూ.12,999గా, గెలాక్సీ ఎం06 5జి ఫోన్ ధ‌ర రూ.9,249గా ఉండ‌నుంది. అదేవిధంగా ఐక్యూకు చెందిన ఐక్యూ15ను రూ.65,999 ధ‌ర‌కు ఈ సేల్‌లో కొన‌వ‌చ్చు. ఐక్యూ నియో 10 5జి ఫోన్‌ను రూ.33,999కు, ఐక్యూ జ‌డ్‌10ఆర్ 5జి ఫోన్‌ను రూ.18,499కు విక్ర‌యిస్తారు. అలాగే రియ‌ల్‌మి నార్జో 80 ప్రొ 5జి ఫోన్‌ను రూ.16,999కు, నార్జో 80 లైట్ 5జి ఫోన్‌ను రూ.11,499కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక షియోమీకి చెందిన రెడ్‌మి ఎ4 5జి ఫోన్‌ను రూ.8,299 ధ‌ర‌కు ఈ సేల్‌లో కొన‌వ‌చ్చు. రెడ్‌మి 13 5జి ఫోన్ ధ‌ర రూ.12,499 ఉండ‌గా, రెడ్‌మి నోట్ 14 5జి ఫోన్‌ను రూ.16,498కి విక్ర‌యిస్తారు. పోకో సి75 5జి ఫోన్‌ను రూ.8,799కు విక్ర‌యించ‌నున్నారు.

ఇత‌ర ఆఫ‌ర్లు..

ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్ ను అందిచ‌నున్నారు. అలాగే ప‌లు బ్రాండ్ల‌కు చెందిన ట్యాబ్‌లు, స్మార్ట్ వాచ్‌లు, ఇయ‌ర్‌బ‌డ్స్‌, హెడ్ ఫోన్లు, సౌండ్ బార్లు, గేమింగ్ హ్యాండ్‌హెల్డ్ ప‌రిక‌రాలు, ల్యాప్‌టాప్‌లు, యాక్సెసరీస్, కెమెరాలు, రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లు, స్టిక్ వాక్యూమ్స్, ప‌ర్సనల్ కేర్ ఉత్పత్తులు, హోమ్ అప్లయన్సెస్ వంటి వ‌స్తువుల‌పై కూడా భారీ ఎత్తున రాయితీల‌ను అందివ్వ‌నున్నారు. అలాగే ఈ సేల్‌లో ఎస్‌బీఐ కార్డుల‌తో ఈఎంఐ విధానంలో వ‌స్తువుల‌ను కొంటే 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా 5 శాతం మేర అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్‌ను ఇస్తారు. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్ పై 75 శాతం, టీవీలు, అప్లయన్సెస్ పై 65 శాతం, ఫర్నిచర్ పై 70 శాతం, స్మార్ట్‌ఫోన్లు, యాక్సెసరీస్ పై 40 శాతం వ‌ర‌కు రాయితీల‌ను అందిస్తున్నారు. అలాగే కిచెన్, డైనింగ్ ఉత్ప‌త్తుల‌పై 70 శాతం, ఇండస్ట్రియల్ సప్లైస్ పై 60 శాతం వరకు రాయితీల‌ను అందివ్వ‌నున్నారు. మ‌రిన్ని వివ‌రాల‌కు అమెజాన్ లో అధికారిక సేల్‌ పేజీని సందర్శించవచ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement